Nicholas Pooran Ties The Knot With Alyssa Miguel: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. అంతర్జాతీయంగా సైతం పలువురు ప్రధానులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటలు, క్రికెటర్లు వివాహబంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ చేరిపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విండీస్ బ్యాట్స్‌మెన్, 25 ఏళ్ల నికోలస్ ఇటీవల తన ప్రేయసితో ఎంగేజ్‌మెంట్ సందర్భంగా ఫొటోలను షేర్ చేసుకోవడం తెలిసిందే. చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్న ప్రేయసి అలిస్సా మిగుల్‌ (కత్రినా మిగుల్)ను వెస్టిండీస్ (West Indies Cricketer) స్టార్ క్రికెటర్ పూరన్ పెళ్లాడాడు. కొందరు సన్నిహితుల సమక్షంలో నికోలస్ పూరన్, అలిస్సా మిగుల్ వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ‘జీసస్ నాకు ఇప్పటివరకూ ఎన్నో అందించారు. కానీ అన్నింటిలోనూ గొప్పది నీతో జీవితం’ అంటూ జీవిత భాగస్వామి అలిస్సా మిగుల్‌కు స్వాగతం పలికాడు.


Also Read: Team India కెప్టెన్ విరాట్ కోహ్లీ Vegan అయితే కోడిగుడ్లు తింటున్నాడట, నెటిజన్లు సెటైర్స్ 



నికోలస్ పూరన్‌తో వివాహంపై విండీస్ క్రికెటర్ ప్రేయసి, వధువు స్పందించింది. జీసన్ ఆశీర్వాదం లభించింది. నా జీవితంలోకి నువ్వు రావడం ఎంతో ఆనందంగా ఉందని కత్రినా మిగుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేసింది. నాలుగేళ్ల డేటింగ్ అనంతరం నవంబర్ 2020లో అలిస్సా మిగుల్, పూరన్‌ల నిశ్చితార్థం జరిగింది. 


Also Read: WTC Final Reserve Day: తొలి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం


కాగా, యూఏఈలో జరిగిన గత సీజన్ ఐపీఎల్‌లో రాణించిన నికోలస్ పూరన్ ఇటీవల నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 (IPL 2021)లో చాలా నిరాశపరిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హార్డ్ హిట్టర్‌గా తీసుకున్న ఈ విండీస్ ఆటగాడు వరుస 5 ఇన్నింగ్స్‌లలో 3 పర్యాయాలు డకౌట్ కాగా, ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లాడిన నికోలస్ పూరన్ కేవలం 28 పరుగులు చేశాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook