Kieron Pollard Smashes 6 Sixes In An Over: వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కరీబియన్ వీరుడు ఒకే ఒవర్లో 6 సిక్సర్లు బాది అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ నమోదు చేసిన 8వ క్రికెటర్ కాగా, వెస్టిండీస్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా విండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ నిలిచాడు.
శ్రీలంక జట్టుతో జరిగిన తొలి టీ20లో ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. అంతకుముందు శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టడం గమనార్హం. విండీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌ను సైతం డకౌట్ చేశాడు. అనంతరం కెప్టెన్ కీరన్ పోలార్డ్(Kieron Pollard) బ్యాట్ ఝులిపించాడు. అఖిల ధనంజయ బౌలింగ్‌లో 6 బంతులను సిక్సర్లుగా మలిచాడు. పోలార్డ్ 11 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
Six sixes in a row🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/VhmSTPfmvE
— VK & MB fan (@MaheshB46099951) March 4, 2021
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తొలుత విండీస్ బౌలర్లు సత్తా చాటగా, ఆపై బ్యాట్స్‌మెన్ మిగతా పనిని కేవలం 13.1 ఓవర్లలో పూర్తి చేశారు. 10 రన్ రేటుతో పరుగులు సాధించి ఘన విజయాన్ని అందుకుంది విండీస్ టీమ్. వెస్టిండీస్(West Indies) మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ 24 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లాంఛనాన్ని పూర్తి చేశాడు.
యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై తొలి టీ20 వరల్డ్ కప్‌లో కొట్టిన సిక్సర్ల ఫీట్‌ను కీరన్ పోలార్డ్ రిపీట్ చేయగా క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీ20ల్లో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి విండీస్ క్రికెటర్ పోలార్డ్. ఓవరాల్ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి క్రికెటర్ విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ కాగా, రెండో విండీస్ ఆటగాడు పోలార్డ్. ఓవరాల్‌గా ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన 8వ బ్యాట్స్‌మెన్ అయ్యాడు. భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షల్ గిబ్స్ ఈ అరుదైన ఘనతను సాధించారు.
Also Read: Dhanashree Verma Photos: మాల్దీవులలో భార్యతో టీమిండియా స్పిన్నర్ Yuzvendra Chahal, వైరల్ అవుతున్న ఫొటోషూట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook