పగిలిన అద్దంపై.. క్రికెటర్ ఆటోగ్రాఫ్
వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో భాగంగా జింబాబ్వే రాజధాని హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో వెస్టీండీస్ ఆడిన మ్యాచ్‌లో ఓ విచిత్రం జరిగింది.
వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో భాగంగా జింబాబ్వే రాజధాని హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో వెస్టీండీస్ ఆడిన మ్యాచ్‌లో ఓ విచిత్రం జరిగింది. ఐర్లండ్ బౌలర్ కెవిన్ ఒబ్రెయిన్ వేసిన బంతిని విండీస్ ఆటగాడు పావెల్ సిక్సర్ కొట్టగా.. అది స్టేడియంలోని ప్రెస్ బాక్స్ అద్దాన్ని బలంగా తాకడంతో.. అది భల్లున పగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో పావెల్ 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు.
పావెల్‌కి తన కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అలాగే 7వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగి సెంచరీ సాధించిన వెస్టీండీస్ ఆటగాడిగా కూడా అతను ఘనతకెక్కాడు. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక, ప్రెస్ బాక్స్ వద్దకు వచ్చి.. పగిలిన అద్దంపై ఆటోగ్రాఫ్ చేశాడు. తాను చేసిన పరుగులకు గుర్తుగా తాను ఆ ఆటోగ్రాఫ్‌ను చేశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 52 పరుగులతో ఐర్లాండ్ పై విజయాన్ని నమోదు చేసింది.