West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ లో కరోనా కలకలం- 5 మందికి కొవిడ్ పాజిటివ్
West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టులో మరో ముగ్గురు క్రికెటర్లు సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. కొవిడ్ బారిన పడిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు వెస్టిండీస్ బోర్డు అధికారులు తెలిపారు.
West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. విండీస్ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకగా.. అదే టీమ్ కు సంబంధించిన మరో ఇద్దరు సహాయ సిబ్బంది కొవిడ్ బారిన పడినట్లు ఆ దేశ బోర్డు తెలిపింది.
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వికెట్‌కీపర్-బ్యాటర్ షాయ్ హోప్, స్పిన్నర్ అకీల్ హోసేన్, ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ సహా సహాయక కోచ్ రాడీ ఎస్ట్‌విక్, జట్టు ఫిజీషియన్ డా.అక్షయ్ మాన్‌సింగ్‌కు వైరస్ సోకినట్లు ప్రకటించారు. పాక్ క్రికెట్ బోర్డు నిర్వహించిన తాజా పరీక్షల్లో వీరికి పాజిటివ్‌గా తేలింది.
దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు సహా సహాయక సిబ్బందిని ఐసొలేషన్‌కు పంపించినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది. అంతకుముందు ఇదే జట్టులో ఉన్న రోష్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్‌తో పాటు మరో సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన విండీస్ క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది.
మరోవైపు పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి మూడో టీ20 ఆడాల్సిఉంది. తొలి రెండు మ్యాచుల్లో పాక్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నాయి.
Also Read: BCCI vs Team India Captains: బీసీసీఐపై వ్యతిరేకత కనబర్చిన మాజీ ఇండియా కెప్టెన్లు ఎవరో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook