BCCI vs Team India Captains: బీసీసీఐపై వ్యతిరేకత కనబర్చిన మాజీ ఇండియా కెప్టెన్లు ఎవరో తెలుసా

బీసీసీఐకు వ్యతిరేకంగా టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్స్ గళమెత్తడం ఇదేమీ కొత్త కాదు. కేవలం విరాట్ కోహ్లీ వర్సెస్ బీసీసీఐ మాత్రమే కాదు. తనను తొలగించడంపై బీసీసీఐకు స్పష్టత లేదని విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఇప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..వీరంతా అలా తొలగించబడినవారే...ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం..

BCCI vs Team India Captains: బీసీసీఐకు వ్యతిరేకంగా టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్స్ గళమెత్తడం ఇదేమీ కొత్త కాదు. కేవలం విరాట్ కోహ్లీ వర్సెస్ బీసీసీఐ మాత్రమే కాదు. తనను తొలగించడంపై బీసీసీఐకు స్పష్టత లేదని విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఇప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..వీరంతా అలా తొలగించబడినవారే...ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం..

1 /5

టీమ్ ఇండియా లెజెండ్ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌ను కూడా అదే విధంగా హఠాత్తుగా తొలగించారు. కెర్రీ ప్యాకర్స్ వరల్డ్ సిరీస్‌కు అడినందుకే బీసీసీఐ అప్పట్లో గవాస్కర్‌ను తొలగించిందని సమాచారం.

2 /5

అంతకుముందు అంటే 1979లో అప్పటి కెప్టెన్ శ్రీనివాస్ వెంకటరాఘవన్ పరిస్థితి మరీ దయనీయం. ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ ద్వారా అతడిని తొలగిస్తున్న విషయం ప్రకటించారు. ఆ సమయంలో ఇండియన్ టీమ్ ఇంగ్లండ్ నుంచి ఇండియాకు వెనక్కి వస్తోంది. వెంకట రాఘవన్ స్థానంలో సునీల్ గవాస్కర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

3 /5

మాస్టర్ బ్లాస్టర్, ప్రపంచం మెచ్చిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం 1997లో సిరీస్ చివర్లో కెప్టెన్సీ నుంచి తప్పించబడ్డాడు. తనను చాలా అగౌరవంగా బాథ్యతల్నించి తప్పించారని..బీసీసీఐ నుంచి ఎవరూ ఈ విషయంపై సంప్రదించలేదని..తనను తప్పిస్తున్న విషయం చెప్పలేదని ఆటో బయోగ్రఫీలో సచిన్ టెండూల్కర్ స్వయంగా రాసుకున్నాడు.

4 /5

ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా తొలగించబడ్డాడు. గంగూలీ స్థానంలో అప్పుడు రాహుల్ ద్రావిడ్‌కు బాధ్యతలు అప్పగించారు.  గంగూలీ ఫిజికల్‌గా..మానసికంగా టీమ్ లీడ్ చేసేందుకు అన్‌ఫిట్ అంటూ బీసీసీఐకు మాజీ టీమ్ ఇండియా కోచ్ రాసిన లేఖ అప్పట్లో సంచలనమైంది. ఆ లేఖ తరువాతే గంగూలీని తొలగించారు. 

5 /5

టీమ్ ఇండియా ప్రముఖ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి వైదొలగిన తరువాత..బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి...రోహిత్ శర్మను ఎంపిక చేసింది. కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్న విషయం తనకు చెప్పలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x