WFI President Sanjay singh hot comments on vinesh phogat coach and support staff: వినేష్ ఫోగట్ నిన్న రాత్రి చారిత్రక విజయం సాధించారు. నాలుగు సార్లు వరల్డ్ నంబర్ వన్ గా సత్తాచాటిన రెజ్లర్ సుసాకిని  ఓడించింది. దీంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయారు. భారత్ కు మరో పతకం పక్కా... అని సంబరాలలో మునిగిపోయారు. ఎన్నోఏళ్ల పడిన కష్టానికి.. వినేష్ ఫోగట్ మంచి పతకంతో భారత్ ను గోల్డ్ పతకం గెల్చుకుని,  మరోసారి విశ్వ వేదికపై తలెత్తుకునేలా చేస్తుందని అందరు ఆశలు పెట్టుకున్నారు.  వినేష్ ఫోగట్ విజయం సాధించాలని ఆమె అభిమానులు, భారతీయులు ఎందరో పూజలు సైతం చేశారు. ఈ క్రమంలో.. ఒక్కసారిగా కోట్ల మంది భారతీయులపై పిడుగు లాంటి వార్తపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా డిస్ క్లాలీఫ్ అయినట్లు ఒలింపిక్స్ సంఘం ప్రకటించింది. దీంతొ చాలా సేపు అసలు ఏంజరిగిందో అని టీవీల ముందు కూర్చుండి పోయారు. ఈ నేపథ్యంలో.. వినేష్ ఫోగట్ ఓవర్ నైట్ లో బరువు పెరగటంపై ప్రస్తుతం బిగ్ సస్పెన్స్ నెలకొంది. నిన్న రాత్రి వినేష్ ఫోగట్ బరువు ఒక్కసారిగా 2 కేజీలకు పైన పెరగటం ను ఇండియన్ మెడికల్ టీమ్ గుర్తించారు.


దీంతో  ఆమె రాత్రంతా మెల్కొని సైక్లింగ్ లు,  ఎక్సర్ సైజ్ లు, ఆవిరి పట్టడం వంటివి చేశారు. జుట్టును కూడా కత్తిరించుకున్నారు. అంతేకాకుండా.. ఆహారం, నీళ్లను కూడా ఎక్కువగా తీసుకొలేదు. దీంతో ఆమె చాలా వరకు బరువును కొల్పోయారు. కానీ కేవలం వంద గ్రాముల వద్ద మాత్రం దొరికిపోయారు. దీంతో ఆమెను ఒలింపిక్స్ సంఘం అనర్హురాలిగా ప్రకటించింది.


దీనిపై ఇటు ఒలింపిక్స్ సంఘంతో పాటు, భారత్  రెజ్లింగ్ సమాఖ్య  అధ్యక్షుడు సంజయ్ సింగ్ కూడా అనుమాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ నైట్ లో ఆమె బరువుపెరగటానికి కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు చేయాల్సిన అవసరముందంటున్నారు. ముఖ్యంగా వినేష్ ఫోగట్, కోచ్.. ఆమె దగ్గర ఉండే న్యూట్రిషన్ లపై విచారణ చేపట్టాలని కూడా సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Read more: Rashmika mandanna: క్యూట్ నెస్ కు కేరాఫ్.. రష్మిక మందన్న ముద్దుపేరు ఏంటో తెలుసా..?  
 


ఈ వ్యవహరంలో తాము.. వినేష్ ఫోగట్ తప్పు ఉందని భావించడంలేదని,  కానీ ఆమె చుట్టుపక్కల ఉన్న వారి మీద విచారణ చేయాల్సిన బాధ్యత మాత్రం ఉందని కేంద్రంను కోరారు. వినేష్ కు దేశం అండగా ఉంటుందని చెప్తునే.. ఈ వహరంపై న్యాయపరంగాముందుకు వెళ్తామన్నారు. ఇదిలా ఉండగా.. భారతమహిళ రెజ్లర్ లపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై గతేడాది వినేష్ సింగ్ సహా.. స్టార్ రెజ్లర్ లు తీవ్ర ఆందోళనలు చేశారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సివచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ను ఎన్నుకొవాల్సి వచ్చింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter