రష్యా వేదికగా ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఎంతో గొప్పగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ టోర్నీలో అత్యద్భుత రికార్డు నమోదు చేసిన ఫుట్ బాల్ ప్లేయర్లకు గోల్డెన్‌ బాల్‌, గోల్డెన్‌ బూట్‌, గోల్డెన్‌ గ్లోవ్ మొదలైన అవార్డులను ఆఖరి మ్యాచ్ పూర్తయ్యాక అందిస్తారు. అయితే వీటన్నింటిలో గోల్డన్ బూట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సూపర్ డూపర్ అవార్డు ఇది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆకర్షించే అవార్డు కూడా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1982 నుండీ ఈ ప్రత్యేకమైన అవార్డును అందిస్తున్నారు. 2014లో కొలింబియా ప్లేయర్ జేమ్స్‌ రోడ్రిగ్స్‌ ఆరు గోల్స్ చేసి ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. అలాంటిది ఈ సంవత్సరం ఈ అవార్డు ఎవరు గెలుచుకుంటారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి ఈ అవార్డును అందుకోవడానికి రేసులో ఉన్న ప్లేయర్లలో  ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్‌ ప్రథమ వరుసలో ఉన్నాడు. 


ఇప్పటికే గ్రూప్ స్థాయిలో ఆడిన రెండు మ్యాచ్‌లలో 5 గోల్స్ సాధించిన ఈయన.. ఓ మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ గోల్స్ చేసి ఫుట్ బాల్ అభిమానుల గుండెల్లో స్టార్ హోదాను కైవసం చేసుకున్నాడు. రోడ్రిగ్స్ తర్వాతి స్థానాల్లో  రొమేలు లుకాకు (4 గోల్స్, బెల్జియం), క్రిస్టియానో రొనాల్డో(4 గోల్స్, పోర్చుగల్‌), డెనీస్‌(3 గోల్స్, రష్యా), డీగో కోస్తా (3 గోల్స్, స్పెయిన్‌) ఉన్నారు. అయితే ఎవరిని గోల్డెన్ బూట్ వరిస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం ఆఖరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.