Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!
IND vs USA T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఈ బౌలర్ నేత్రవాల్కర్ అదరగొడుతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ బ్యాట్స్మెన్లను ఔట్ చేసి.. మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ పర్ఫామెన్స్తో నేత్రవాల్కర్‌ను మళ్లీ ఇండియాకు వచ్చేయ్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
IND vs USA T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా దుమ్ములేపుతోంది. బుధవారం రాత్రి యూఎస్ఈపై 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి గ్రూపు-ఏ నుంచి టాప్ ప్లేస్‌లో సూపర్-8లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. కేవలం 118 పరుగులు మాత్రమే చేసింది. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు తీయగా.. హార్థిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (50) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. శివమ్ దూబే (31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. సూర్య, దూబే విజయ తీరాలకు చేర్చారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అర్ష్‌దీప్ సింగ్‌కు లభించింది.
Also Read: Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు కోర్టు..
ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. యూఎస్‌ఈ మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ కావడం ఇదే తొలిసారి. భారత సంతతికి చెందిన నేత్రవాల్కర్ కోహ్లీని పెవిలియన్‌కు పంపించి మరోసారి వార్తల్లో నిలిచాడు. కోహ్లీ డకౌట్ కావడంతో అవతలి ఎండ్‌లో నిలబడిన కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశకు గురయ్యాడు. అయితే కాసేపటికే నేత్రవాల్కర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కూడా ఔట్ అయ్యాడు. మనోడే అనుకుంటే రెండు కీలక వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లో నెట్టాడు. అయితే కీలక సమయంలో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ జారవిడిచి.. మనకు మంచి చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ మరింత కష్టాల్లో పడేది.
టీ20 వరల్డ్ కప్‌లో నేత్రవాల్కర్ బౌలింగ్ చూసి ఫ్యాన్స్ తిరిగి ఇండియాకు వచ్చేయ్ బ్రో అని అడుగుతున్నారు. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఆడిన నేత్రవాల్కర్.. ఆ తరువాత ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ అగర్వాల్ వంటి ప్లేయర్లతో కలిసి క్రికెట్ ఆడాడు. 2015లో టీమిండియా జట్టులో ఛాన్స్ రాకపోవడంతో అమెరికా వెళ్లాడు. 2019లో యూఎస్ఈ తరపున ఎంట్రీ ఇచ్చాడు. ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు.
Also Read: Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి