Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 13, 2024, 02:35 PM IST
Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ లో చలసాని అశ్వనీదత్ భారీ ఎత్తున తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 AD’. టైమ్ మిషన్ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ స్టార్ డమ్ తో అమెరికాలో విడుదలకు 15 రోజులు ముందే  1 మిలియన్ ప్రీ సేల్స్ ను సొంతం చేసుకుంది. అటు నార్త్ అమెరికా కలిపితే 1.25 మిలియన్ మార్క్ ప్రీ సేల్స్ ను సొంతం చేసుకొని విడులకు 15 రోజుల ముందు ఏ భారతీయ సినిమా సాధించని రికార్డు సొంతం చేసుకుంది.

కల్కి మూవీ కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఈ రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు కల్కి మూవీ అసలు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. అయినప్పటికీ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేయగానే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం మాములు విషయం కాదు. మరోవైపు నార్త్ భారత్ తో పాటు మిగిలిన  భాషల్లో ప్రమోషన్స్ స్టార్ట్ అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ సేల్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.

అంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు 13 రోజుల ముందు 1 మిలియన్ మార్క్ సొంతం చేసుకుంది. తాజాగా ఆ రికార్డును  ప్రభాస్ కల్కి మూవీ క్రాస్ చేసింది. మొత్తంగా కల్కి మూవీ ఫస్ట్ డే భారతీయ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులకు పాతర వేసేలా ఉంది. త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ను వచ్చే వారం ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి.  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు పర్మిషన్స్ తీసుకునే అవకాశాలున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం.. పైగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండటం.. బాలయ్య ఎమ్మెల్యేగా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కల్కి మూవీ తెలుగు సహా తమిళంలో కమల్ హాసన్ ఫ్యాక్టర్.. హిందీలో ప్రభాస్ తో పాటు అమితాబ్, దీపికా ఫ్యాక్టర్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశాలు. ఏది ఏమైనా కల్కి మూవీ తెలుగు సహా భారతీయ సినిమా చరిత్రలో ఎలాంటి అద్భుతాలు నమోదు చేస్తుందో చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News