మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్.. డేవిడ్ వార్నర్‌కే ఎందుకిచ్చారంటే?
Wasim Akram: డేవిడ్ వార్నర్‌కు టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడంపై మరో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈ అవార్డ్‌కు వార్నర్‌నే ఎందుకు ఎంపిక చేశారో తెలిపాడు.
Wasim Akram gives his verdict Player of the Tournament: టీ20 వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం పలు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా టోర్నమెంట్ అనంతరం ప్రకటించిన అవార్డులపై వివాదాలు తలెత్తాయి. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ (Man of the Tournament to David Warner) ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వార్నర్‌కు ఈ అవార్డ్ ఇవ్వడాన్ని పాక్ మాజీ క్రెకెటర్ షోయల్ అక్తర్ ఇప్పటికే తప్పుబట్టాడు. ఈ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని కూడా వ్యక్త పరిచాడు. నిజానికి ఈ అవార్డ్ పాక్ కెప్టెన్ బాబర్ (Babar Azam) అజామ్‌కు రావల్సిందని అభిప్రాయపడ్డాడు.
ఈ విషయంపై తీవ్రంగా చర్చ సాగుతుండగా.. పాకిస్థాన్‌కు చెందిన మరో మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కూడా (Wasim Akram on Man of the Tournament award) ఈ అంశంపై స్పందించాడు. అయితే అతడు డేవిడ్ వార్నర్‌కే ఈ అవార్డ్ ఎందుకు దక్కిందో చెప్పడం గమనార్హం.
Also read: న్యూజిలాండ్‌పై ఇండియా విజయం.. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌కి శుభారంభం
అవార్డ్ ఎందుకు ఇస్తారంటే..
సాధారణంగా ఏదైనా క్రికెట్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన లేదా ఎక్కువ వికెట్లు పడగొట్టిన వారికి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇస్తుంటారు. అలా 'టీ20 వరల్డ్‌కప్ 2021'లో ఈ అవార్డ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు దక్కింది.
Also read: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. మెరుగైన ర్యాంకుల్లో వార్నర్, జంపా
వసీమ్ అక్రమ్ వివరణ ఇలా..
డేవిడ్ వార్నర్ టోర్నమెంట్ మొత్తం మీద 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేశాడు. అయితే ఇదే సమయంలో పాక్ ఆటగాడు బాబర్ అజామ్ 6 మ్యాచుల్లో 303 పరుగులు చేయడం గమనార్హం. రన్స్ పరంగా చూస్తే ఈ అవార్డ్ బాబర్ అజామ్‌కు దక్కాల్సి ఉంటుంది.
దీనిపై స్పందిస్తూ.. అన్ని సార్లు పరుగులను మాత్రమే చూడలేమన్నాడు వసీమ్ అక్రమ్. ఆ పరుగుల ప్రభావం జట్టు విజయానికి ఎలా పని చేశాయో కూడా చూస్తారని చెప్పుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ ఈ టోర్నమెంట్లో కీలకమైన సమయాల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడని తెలిపాడు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా టైటిల్‌ను సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.
Also read: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ.. అనిల్ కుంబ్లే స్థానంలో నియామకం..
ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ప్రదర్శన..
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో మిచెల్ మార్ష్(77), డేవిడ్ వార్నర్(53) అద్భుతంగా బ్యాటింగ్ చేసి తమ జట్టును గెలిపించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో 18.5 ఓవర్లలో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్(85) చెలరేగాడు.
Also read: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన
Also read: Champions Trophy Host: 2025లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook