HCA BMW Offer: హైదరాబాద్ క్రికెటర్లకు బంపరాఫర్.. రూ.కోటి నగదు, బీఎండబ్ల్యూ కారు
HCA Cash Reward BMW Car: ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు వీలైనంత ప్రోత్సాహం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం భరోసా ఇచ్చింది. రాబోయే టోర్నమెంట్లో సత్తా చాటితే రూ.కోటి నజరానా, బీఎండబ్ల్యూ కారు అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది.
Ranji Trophy Rewards Rs. One Crore adn BMW Car: గతంలో వివాదాలు, విబేధాలతో మసకబారిన హైదరాబాద్ క్రికెట్ సంఘానికి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త కార్యవర్గం ఎన్నికై కార్యనిర్వహణపై పూర్తి దృష్టి సారించింది. అధ్యక్షుడు అర్సినపల్లి జగన్‌మోహన్ రావు హెచ్‌సీఏకు పూర్వ వైభవం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో చాంపియన్‌గా నిలవడంతో జగన్‌మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇదే మాదిరి రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూపులో హైదరాబాద్ చాంపియన్‌గా నిలిస్తే భారీ కానుకలు ఇస్తామని వెల్లడించారు.
Also Read: Anushka Baby Boy: 'బుల్లి విరాట్ కోహ్లీ' వచ్చేశాడు.. పుత్రోత్సాహంలో విరాట్ కోహ్లీ, అనుష్క.
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు సభ్యులను హైదరాబాద్‌లో మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. ఈ సీజన్‌లో ప్రతిభ కనబర్చిన కెప్టెన్ తిలక్ వర్మ, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, శతకం సాధించిన నితేశ్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డికి రూ.50 వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు సంచలన ప్రకటన చేశారు.
Also Read: IPL 2024 Schedule: ఐపీఎల్ ప్రారంభంపై స్పష్టత.. అప్పటి నుంచే మొదలవుతుందని చైర్మన్ ప్రకటన
'వచ్చే మూడేళ్లలో రంజీ ట్రోఫీ ఎలిట్ గ్రూపులో హైదరాబాద్ చాంపియన్‌గా నిలిస్తే జట్టుకు రూ.కోటి నజరానా అందిస్తాం. అంతేకాకుండా ఒక్కో ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తాం. ప్రతిభ చాటిన క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తాం' అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. వచ్చే సీజన్‌లోనూ ఇదే ప్రదర్శన కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించారు.
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో హైదరాబాద్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో మేఘాలయపై తలపడిన తిలక్‌వర్మ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూపులో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌లో ఎలీట్ గ్రూపులో హైదరాబాద్ జట్టు తలపడనుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం బీసీసీఐతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే భారీ నజారానాలు ప్రకటించడంతో ఆటగాళ్లు మరింత ఉత్సాహంగా ప్రదర్శన చేపట్టే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి