Womens T20 Challenge: వుమెన్స్ ఐపీఎల్‌గా పరిగణించే వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ ఫైనల్ పోరులో సూపర్‌నోవాస్ వుమెన్స్ జట్టు వెలాసిటీ జట్టుపై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్‌‌నోవాస్ 4 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. చివరి ఓవర్‌లో వెలాసిటీ జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. కేవలం 12 పరుగులే చేయడంతో సూపర్‌నోవాస్ గెలుపొందింది. ఈ విజయంతో మూడోసారి వుమెన్స్ టీ20 ఛాలెంజ్ సూపర్‌నోవాస్ వశమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవాస్ జట్టు నిర్ణీత20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూపర్‌నోవాస్ జట్టులో డాటిన్ 4 సిక్సులు, 1 ఫోర్‌తో 62 (44) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 3 సిక్సులు, 1 ఫోర్‌తో 43 (29) పరుగులతో రాణించింది. మిగతా ప్లేయర్స్‌లో ఓపెనర్ ప్రియా పునియా మాత్రమే (28) చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్, కెప్టెన్ దీప్తి శర్మ, సిమ్రాన్ బహదూర్ తలో రెండు వికెట్లు తీశారు.


166 పరుగుల లక్ష్య చేధనతో బరిలో దిగిన వెలాసిటీ జట్టులో లారా వొల్వార్డ్ (65) మినహా మిగతా బ్యాటర్స్ ఎవరూ రాణించలేదు. వొల్వార్డ్ చివరి వరకు పోరాడిన జట్టును విజయ తీరానికి చేర్చలేకపోయింది. చివరి ఓవర్లలో వొల్వార్డ్, సిమ్రన్ మెరుపులు మెరిపించినా టార్గెట్‌ను చేధించలేకపోయారు. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా కేవలం 12 పరుగులే చేయగలిగారు. దీంతో వెలాసిటీకి ఓటమి తప్పలేదు. గతంలో 2018, 2019 సీజన్లలో  వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న సూపర్‌నోవాస్ తాజా విజయంతో మూడోసారి టైటిల్ నెగ్గింది.  



Also Read: NewBrew Beer: మార్కెట్లోకి కొత్త బీర్ బ్రాండ్... మూత్రం, డ్రైనేజీ నీళ్లతో తయారీ...


Also Read:   Yama Raj Death Signals: మృత్యు గడియలు సమీపించే ముందు కనిపించే 4 సంకేతాలివే...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook