NewBrew Beer: మార్కెట్లోకి కొత్త బీర్ బ్రాండ్... మూత్రం, డ్రైనేజీ నీళ్లతో తయారీ...

Beer Made From Urine and Sewage Water: సింగపూర్‌లో ఇటీవల ఓ కొత్త బీర్ బ్రాండ్ లాంచ్ అయింది.. ఆ బీర్‌ను పూర్తిగా శుద్ధి చేసిన మూత్రం, డ్రైనేజీ నీళ్లతో తయారుచేస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 29, 2022, 12:41 AM IST
  • సింగపూర్‌లో కొత్త బీర్ బ్రాండ్
  • లాంచ్ చేసిన న్యూబ్రూ కంపెనీ
  • శుద్ధి చేసిన మూత్రం, డ్రైనేజీ నీళ్లతో బీర్ తయారీ
NewBrew Beer: మార్కెట్లోకి కొత్త బీర్ బ్రాండ్... మూత్రం, డ్రైనేజీ నీళ్లతో తయారీ...

Beer Made From Urine and Sewage Water: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బీర్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒక అంచనా ప్రకారం.. మంచినీళ్లు, టీ తర్వాత ప్రపంచంలో అత్యంత పాపులర్ డ్రింక్‌గా బీర్ మూడో స్థానంలో ఉంది. సాధారణంగా బీర్ తయారీకి నీటి అవసరం చాలా ఎక్కువ. సింగపూర్ లాంటి అత్యంత నీటి కొరత ఉండే దేశాల్లో బీర్ తయారీ కంపెనీలకు వాటర్ సప్లై అనేది పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు సింగపూర్‌కి చెందిన బ్రూవరీస్ 'న్యూబ్రూ' మార్కెట్లోకి సరికొత్త బీర్‌ను తీసుకొచ్చింది.

న్యూబ్రూ తీసుకొచ్చిన ఈ బీర్‌ను పూర్తిగా శుద్ధి చేసిన మూత్రం, డ్రైనేజీ నీళ్లతో తయారుచేస్తారు. డ్రైనేజీ నీళ్లు అనగానే చాలామందికి కడుపులో తింపేసినట్లు అనిపించవచ్చు. కానీ ఈ నీరు అత్యంత స్వచ్చమైనది. అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి అనేక దశల్లో నీటిని ఫిల్టర్ చేసి, పరీక్షించిన తర్వాతే బీర్ తయారీకి ఉపయోగిస్తారు. సింగపూర్‌లో నీటి కొరత రీత్యా... అక్కడి వాటర్ ఏజెన్సీ, న్యూబ్రూ సంస్థ కలిసి ఈ ఏడాది ఏప్రిల్ 18న ఈ బీర్ బ్రాండ్‌ను లాంచ్ చేశాయి. ఒకరకంగా నీటి సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని సింగపూర్ వాటర్ ఏజెన్సీ భావిస్తోంది.

ఈ బీర్ తయారీలో ఉపయోగించే నీటిలో 95 శాతం నీరు రీసైక్లింగ్ చేసిందేనని న్యూబ్రూ సంస్థ వెల్లడించింది. ఈ రీస్లైకింగ్ వాటర్‌నే సింగపూర్‌లో న్యూవాటర్ అని పిలుస్తారు. కేవలం బీర్ తయారీలోనే కాదు... అక్కడ 45 శాతం తాగునీటి అవసరాలను కూడా ఈ న్యూవాటరే తీరుస్తోంది. సింగపూర్‌లో భూమి కొరత, జల వనరుల కొరత చాలా తీవ్రమైన సమస్య. ఈ కారణంగానే అక్కడ రీసైక్లింగ్ వాటర్‌ను డ్రింకింగ్ వాటర్‌గా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Brewerkz Singapore (@brewerkzsg)

Also Read: Teenmar Mallanna Arrest: హనుమకొండలో తీన్మార్ మల్లన్న అరెస్ట్... రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత... 

Also Read:  Viral News: అరుదైన కేసు... భార్యతో 10ని. శృంగారం తర్వాత 'గజిని'లా మారిన వ్యక్తి... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News