Alyssa Healy 170 helps Australia beat England to Win a 7th Title: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. రికార్డు స్థాయిలో ఏడోసారి విశ్వవిజేతగా మహిళల జట్టు నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన పైనల్ పోరులో ఆసీస్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 357 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్ 285 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నటాలీ సీవర్ చివర వరకు పోరాడినా.. జట్టును గెలిపించలేకపోయింది. సీవర్ 121 బంతుల్లో 148 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు రాచెల్‌ హేన్స్‌ (68; 93 బంతుల్లో 7x4), అలిస్సా హేలీ (170; 138 బంతుల్లో 26x4) శుభారంభం చేశారు. ముఖ్యంగా హేలీ బౌండరీల వర్షం కురిపిస్తూ.. పరుగుల వరద పారించింది.  మొత్తం 26 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించింది. మరో ఓపెనర్ హేన్స్ కూడా ధాటిగానే పరుగులు చేసింది. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హేన్స్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ బెత్ మూనీ (62; 47 బంతుల్లో 8x4) అర్ధ శతకంతో రాణించింది. చివరికి ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. 



లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నియెల్లి వ్యాట్‌ (4), టామీ బీమౌంట్‌ (27) ఔటయ్యాక కెప్టెన్‌ హేదర్‌ నైట్‌ (26), నటాలీ సీవర్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆసీస్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో.. ఇంగ్లండ్ పోటీలో నిలువలేకపోయింది. సీవర్ మాత్రం తన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఉన్నంతసేపు పోరాడినా.. ఇతరుల నుంచి సహకారం కరువైంది. చివరకు ఇంగ్లీష్ జట్టు 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. 


Also Read: MLA Raja Singh: గతంలోని కేసులను పక్కన పెట్టారు.. ఇది కూడా అంతే! డ్రగ్స్ కేసుపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు


Also Read: Rahul Sipligunj: రాహులా.. ఏందయ్యా ఇది! డ్రగ్స్ వద్దని సందేశం ఇస్తూనే పబ్ పార్టీలో పట్టుబడితివిగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook