Rahul Sipligunj: రాహులా.. ఏందయ్యా ఇది! డ్రగ్స్ వద్దని సందేశం ఇస్తూనే పబ్ పార్టీలో పట్టుబడితివిగా

Rahul Sipligunj giving Anti-Drugs Awareness Campaign. డ్రగ్స్ వద్దంటూ సందేశం ఇస్తున్న టాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పోలీసులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 02:56 PM IST
  • బంజారాహిల్స్‌ పబ్‌లో రేవ్‌ పార్టీ
  • అడ్డంగా దొరికిపోయిన బిగ్‌బాస్ విన్నర్
  • డ్రగ్స్ వద్దని సందేశం ఇస్తూనే
Rahul Sipligunj: రాహులా.. ఏందయ్యా ఇది! డ్రగ్స్ వద్దని సందేశం ఇస్తూనే పబ్ పార్టీలో పట్టుబడితివిగా

Netizens brutally Trolls Rahul Sipligunj after caught in Banjara Hills Pub raids: హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడింగ్ అండ్ మిగ్ పబ్‌లో ఆదివారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన దాడిలో బిగ్‌బాస్ విన్నర్, టాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. గతంలో కూడా రాహుల్‌పై ఓ పబ్‌లో దాడి జరిగింది. ఆ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. తాజాగా మరోసారి పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

రాహుల్ సిప్లిగంజ్‌కు సంబంధించి మరో అంశం కూడా సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. డ్రగ్స్ కట్టడికి పోలీసులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలకు హాజరవుతున్నారు రాహుల్. మత్తు జోలికి వెళ్లవద్దని యువతకు సందేశం ఇస్తున్నారు. డ్రగ్స్ వద్దంటూ సందేశం ఇస్తున్న రాహులే.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పోలీసులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. రాహుల్ వ్యవహారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ప్రతిష్టను మసకబారుస్తోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో  కొంత కాలంగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఫిబ్రవరి 12న హోంమంత్రి, హైదరాబాద్ సీపీ, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ జోన్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వెస్ట్ జోన్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ బస్తీలో ఏర్పాటు చేసిన మొదటి అవేర్నెస్ కార్యక్రమంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. 

అవేర్నెస్ కార్యక్రమంలో డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను రాహుల్ సిప్లిగంజ్ వివరించారు. అంతేకాదు పాటలు కూడా పాడారు. డ్రగ్స్ నియంత్రణకు అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతూనే హోటళ్లు, పబ్ లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మిగ్ హబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా.. రాహుల్ సిప్లిగంజ్ సహా ప్రముఖులు పట్టుబడ్డారు. రాహుల్ దొరుకుపోవడంతో నెట్టింట అతడిపై జోకులు, మీమ్స్ వర్షం కురుస్తోంది. చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది పాడు పనులు, ఓవైపు సందేశం మరోవైపు చీకటి యవ్వారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Niharika Konidela: రాత్రి నుంచి పోలీస్ స్టేషన్‌లోనే నిహారిక కొణిదెల?.. కౌన్సెలింగ్ అనంతరం..!

Also Read: Drug Mafia: డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్? పోలీసుల కనుసన్నల్లోనే మత్తు మాఫియా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News