Anju Bobby George: భారత మాజీ మహిళా అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్(Anju Bobby George)ని ''ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌''అవార్డు వరించింది. ఈ ఏడాదికి గానూ ఈ పురస్కారాన్ని వరల్డ్‌ అథ్లెటిక్స్‌  ప్రకటించింది. అథ్లెటిక్స్ లో ఆమె చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


లాంగ్‌జంప్‌(Long Jump)లో ఎన్నో ఘనతలు అందుకున్న ఆమె రిటైర్మెంట్‌ తర్వాత 2016లో అమ్మాయిల కోసం ట్రైనింగ్‌ అకాడమీ(Training Academy) స్థాపించింది. ఇప్పటికే అండర్‌-20 విభాగంలో అంజూ బాబీ జార్జీ శిక్షణలో రాటుదేలిన పలువురు యువతులు పతకాలు గెలుపొందారు. ఎంతోమంది భారతీయ యువతులకు ఆదర్శంగా నిలిచిన అంజూబాబీ జార్జీ.. ''ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డుకు అర్హురాలని ఇండియన్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌(Indian Athletics Federation) ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె క్రీడల్లో లింగసమానత్వం కోసం కృషి చేశారు. అంజూ బాబీ జార్జ్ 1977లో కేరళలో జన్మించారు. 


Also Read: David Warner : ఐపీఎల్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై చెప్పేస్తున్నాడా..ఆ పోస్ట్‌కు కారణమేంటి..?


పురుఘల విభాగంలో ఒలింపియన్స్‌ అయిన జమైకాకు చెందిన ఎలైన్‌ థాంప్సన్‌(Thompson).. నార్వేకు చెందిన కార్‌స్టెన్‌ వార్లోమ్‌లు ''వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డుకు ఎంపికయ్యారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook