మాంచెస్టర్ లో జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. కివీస్ జట్టుకు 239 కట్టడి చేశారని ఇక కోహ్లీసేన విజయం తథ్యమని అందరూ భావించారు. అందరి అంచనాలకు తలికిందలు చేస్తూ స్వల్ప లక్ష్య చేధనలో భారత్ పరాజయం పాలైంది.
టాప్ ఆర్డర్ అట్టర్ ప్లాప్..
టాప్ ఆప్టర్ ఘొర వైఫల్యం కారణం ఒకటైతే..చివరికి వరకు పోరాడిన ధోనీ జడేజా ఔట్ అవడం మరొకటి. ముఖ్యంగా చివర్లో ధోనీ రనౌట్ కావడం మ్యాచ్ తో పరాజయం ఖామమైంది. 
జడేజా పోరాటం వృధా 
జడేజా విజృంభణతో  విజయం కోసం చివరి వరకు పోడాడిన భారత్ చివరకు 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో వరల్డ్ కప్ లో కోహ్లీసేన కథ సమాప్తమైంది. టీమిండియా పరాజయం అభిమానులకు గుండెకోతను మిగిల్చింది.


హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీకి కీలకమైన మూడు వికెట్లు దక్కించుకోగా మిగిలిన బౌలర్లలకు  బౌల్ట్, శాంట్నర్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి. కోహ్లీసేనకు విజయవకాశాలను దారుణంగా దెబ్బతీసిన పేసర్ మాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇదిలా ఉండగా కోహ్లీసేనను ఓడించిన కివీస్ జట్టు ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. రేపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీస్ విజేతతో న్యూజిలాండ్ జట్టు జూలై 14న జరిగే టైటిల్ పోరులో తలపడనుంది.