World Cup 2023 India Squad: ప్రపంచ కప్ జట్టులో చాహల్‌కు నో ప్లేస్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Yuzvendra Chahal First Reaction: ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించగా.. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌లో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ట మినహా.. మిగిలిన ఆటగాళ్లను వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారు.
Yuzvendra Chahal First Reaction: రోహిత్ సారథ్యంలోని 15 మంది ఆటగాళ్లతో వరల్డ్ కప్‌కు భారత జట్టును నేడు ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న ఆటగాళ్ల లిస్టునే ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేశారు. ఆసియా కప్‌కు ఎంపికైన తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణతోపాటు సంజూ శాంసన్‌ను పక్కనబెట్టారు. అయితే లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేయకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్‌కు చాహల్‌ను దూరం పెట్టినప్పుడే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచకప్‌కు కూడా ఈ స్టార్ స్పిన్నర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఏకైక స్పిన్ స్పెషలిస్టుగా కుల్దీప్ యాదవ్ ఎంపిక చేయగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు చోటు కల్పించారు.
చాహల్‌ను జట్టులో ఎంపిక చేసి ఉండాల్సిందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత పిచ్‌లు స్పిన్‌గా అనుకూలంగా ఉంటాయి కాబట్టి.. లెగ్ స్పిన్నర్‌గా బౌలింగ్‌లో వైవిధ్యం చూపుతున్నాడని అంటున్నారు. ఇందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయం భిన్నంగా ఉంది. ఎంపిక సమయంలో చాలామంది ఆటగాళ్ల పేర్లను చర్చించామని.. అయితే చివరికి సరైన బ్యాలెన్స్ ఇచ్చే 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని తెలిపారు.
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మధ్య చాలా పోలికలు ఉన్నాయని.. వీరిద్దరితో బ్యాటింగ్ డెప్త్ మరింత పెరుగుతుందని చెప్పారు. తాము అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేశామని వెల్లడించారు. ఈ జట్టే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే.. మార్పులు, చేర్పులు ఉంటాయని అన్నారు.
జట్టులో స్థానం దక్కపోవడంపై చాహల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది ఇండియా.కామ్. అయితే ఈ విషయం సమాధానం చెప్పేందుకు చాహల్ నిరాకరించాడు. పర్వాలేదు.. ఇంటర్వ్యూ లేదు అని చెప్పాడు. జట్టులో స్థానం దక్కనందుకు చాహల్ బాధగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. 2019 ప్రపంచకప్‌లో చాహల్ సత్తాచాటాడు. 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్-చాహల్ జంట టీమిండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించింది. ఈ ఏడాది చాహల్‌కు కేవలం 2 వన్డేల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది.
ప్రపంచకప్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
Also Read: India World Cup 2023 Squad: సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన
Also Read: RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook