Pakistan Players Boycott Sponsors: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో జీతాల లొల్లి.. ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లు బాయ్‌కాట్
Pakistan Cricket Team Salary Controversy: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభంకానున్న తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతున్నాయి. తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆటగాళ్లు బోర్డుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీతాలు ఇవ్వకపోతే స్పాన్సర్‌షిప్ లోగోలు ఉన్న టీషర్టులు ధరించమని హెచ్చరిస్తున్నారు.
Pakistan Cricket Team Salary Controversy: వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఒక్కో జట్టు భారత్‌కు చేరుకుంటున్నాయి. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్టులో మాత్రం వివాదాలు నెలకొన్నట్లు తెలుస్తున్నాయి. ఇప్పటికే టీమ్ సభ్యులు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య కొనసాగుతున్న గొడవలు మరో మలుపు తిరిగాయి. గత 4 నెలలుగా తమకు జీతాలు అందలేకపోవడంతో జట్టు ఆటగాళ్లు తిరుగుబాటు చేశారు. వివాదాన్ని పరిష్కరించకపోతే స్పాన్సర్ లోగో ఉన్న జెర్సీని ధరించబోమని ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు బోర్డుకు చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు ప్రపంచకప్ ప్రచార కార్యక్రమాల్లో పాక్ ఆటగాళ్లు పాల్గొనడం లేదు. జీతాలు చెల్లించకపోతే.. స్పాన్సర్‌షిప్ లోగోలు, ప్రపంచ కప్ ప్రమోషన్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తమ బకాయిలను సకాలంలో చెల్లించడంలో విఫలమైనందుకు పీసీబీపై ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారు.
టెస్ట్, వన్ డే, టీ20ల్లో మూడు ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లకు పీసీబీ ప్రతి నెలా రూ.45 లక్షలు (పాకిస్థానీ రూపాయి) చెల్లిస్తోంది. అయితే ఆటగాళ్లకు చేతికి మాత్రం రూ.27 నుంచి 28 లక్షలు మాత్రమే అందుతున్నాయి. వారి జీతంలో ఎక్కువ భాగం ట్యాక్స్‌కే పోతుంది. దీంతో ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఐదు నెలల క్రితం పీసీబీ చీఫ్‌గా నజం సేథీ ఉన్నప్పుడే ఈ వివాదం మొదలైంది. అయితే ఇప్పుడు జాకా అష్రఫ్ వచ్చినా.. ఆటగాళ్ల జీతాల విషయం అలానే పెండింగ్‌లో ఉంది. వివిధ ఆర్థిక మార్గాల ద్వారా పీసీబీకి 9.8 బిలియన్ రూపాయలు అందుతున్నట్లు నివేదించడంతో ఆటగాళ్లు ఇప్పుడు ఈ సంపదలో వాటాను డిమాండ్ చేస్తున్నారు.
ఐసీసీ, స్పాన్సర్‌లు, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) కాంట్రాక్టులు, ద్వైపాక్షిక సిరీస్‌లతో పీసీబీ పొందే లాభంలో వాళ్లు వాటాలు కావాలని అడుగుతున్నారు. ప్రపంచకప్‌లోపు ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే భవిష్యత్‌పై కూడా ఆలోచించాల్సి ఉంటుందని పాక్ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. పీసీబీ చీఫ్ జాకా అష్రఫ్ పదవి కాలం త్వరలో ముగియనుండగా.. బోర్డుకు కొత్త చీఫ్ వస్తే ఆటగాళ్ల సమస్యలకు పరిష్కారానికి మరింత సమయం పడుతుంది. దీంతో ఈలోపే తమ సమస్యలు పరిష్కరించాలని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేయడంతో బుధవారం భారత్‌కు బయలుదేరే అవకాశం ఉంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో వరల్డ్ కప్ వేటను ప్రారంభించనున్నారు.
Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి