SA vs ENG: చెలరేగిన సఫారీ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం..
SA vs ENG: ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో దూకుడు ప్రదర్శిస్తోంది సౌతాఫ్రికా. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సఫారీ బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశారు. ఆ జట్టు ఆటగాళ్లలో క్లాసెన్ సెంచరీ చేశాడు.
Cricket World Cup 2023, SA vs ENG: వన్డే వరల్డ్ కప్ లో కీలకపోరుకు తెరలేచింది. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా రెండు అగ్రశ్రేణి జట్లయినా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఆ నిర్ణయం సరైనది కాదని ఇంగ్లీష్ జట్టుకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశారు సఫారి బ్యాటర్లు. ఫోర్లు, సిక్సర్లుతో స్టేడియాన్ని హోరెత్తించారు. మెుదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.
బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్లుగా డికాక్, హెండ్రిక్స్ వచ్చారు. తొలి ఓవర్లలోనే సఫారీ టీమ్ కు ఎదురుదెబ్బ తగిలింది. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి డికాక్ ఔటయ్యాడు. అనంతరం హెండిక్స్ తో జతకలిసిన డసెన్ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 121 పరుగులు పార్టనర్ షిప్ నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అదిల్ రషీద్ విడగొట్టాడు. రషీద్ వేసిన 19వ ఓవర్లో డసెన్.. బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ మార్క్రమ్ తో జతకలిసిన హెండ్రిక్స్ మూడో వికెట్ కు 39 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా రషీదే తీసుకోవడం విశేషం.
హెండ్రిక్స్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ ఇంగ్లీష్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. మార్క్రమ్‌తో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ ఇరువురూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. మార్క్రమ్, మిల్లర్ వెంట వెంటనే ఔటైనా జాన్సెన్ సహాయంతో ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు క్లాసెన్. ఈ క్రమంలో కేవలం 67 బంతుల్లోనే 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 109 పరుగులు చేశాడు క్లాసెన్. మరోవైపు జాన్సన్ కూడా 42 బంతుల్లో మూడు ఫోర్లు, 6 సిక్సర్లు సహాయంతో 75 పరుగులు చేశాడు. తమ బ్యాటర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది సఫారీ జట్టు. ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లే మూడు వికెట్లు తీశాడు.
Also read: Australia vs Pakistan: సెంచరీల మోత మోగించిన వార్నర్, మార్ష్.. పాక్ పై ఆసీస్ ఘన విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.