World Test Championship Points Table 2022: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరేందుకు భారత్ అడుగులు వేస్తోంది. బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో 188 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో టాప్‌-2లోకి దూసుకువచ్చింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తాజా పాయింట్ల పట్టికలో భారత జట్టు నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక జట్టు మూడో స్థానంలో.. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నాయి. WTC తాజా పాయింట్ల పట్టికలో.. టీమిండియా 13 మ్యాచ్‌లలో 7 విజయాలతో  87 పాయింట్లను సాధించింది. విజయాల శాతం కూడా 55.7%కి పెరిగింది. శ్రీలంక జట్టు 55.33% విజయ శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 75 శాతంలో మొదటి స్థానంలో.. సఫారీ జట్టు 54.55%తో మూడో స్థానంలో ఉన్నాయి.


మరో నాలుగు విజయాల దూరంలో.. 


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌ చేరడం అంత సులువుగా కనిపించడం లేదు. టీమిండియా 5 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలవాలి. భారత్-బంగ్లా జట్ల మధ్య రెండో, చివరి టెస్టు డిసెంబర్ 22 నుంచి మిర్పూర్‌లో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. బంగ్లాపై రెండో టెస్ట్ గెలవడంతో పాటు ఆసీస్ సిరీస్‌లోనూ  కనీసం మూడు విజయాలు సాధించాలి. దీంతో నాలుగు విజయాలతో భారత్ టెస్ట్ 


కెప్టెన్‌గా రాహుల్‌కు తొలి విజయం..


ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కెప్టెన్‌ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఓ రికార్డు కూడా క్రియేట్ చేశాడు. కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఇటీవల టీ20ల్లో అఫ్ఘానిస్థాన్‌పై గెలుపు.. జింబాబ్వేలో వన్డే సిరీస్‌ను ఛేజిక్కించుకుంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను గెలిపించిన కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె ఈ ఫీట్ నమోదు చేశారు.


Also Read: Jharkhand Murder Case: పెళ్లైన పది రోజులకే దారుణం.. శ్రద్ధా హత్య తరహాలోనే జార్ఖండ్‌లో ఘోరం


Also Read: FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook