Sbi Fixed Deposit Interest Rates: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త. దేశీయ రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది ఎస్‌బీఐ. దీంతో పాటు బ్యాంక్ ఎఫ్‌డీపై కూడా వడ్డీ రేట్లను పెంచింది. అయితే ఇది సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తించనుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు ఎఫ్‌డీల రేట్లను 7.25 శాతానికి పెంచింది. రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ రేట్లన్నీ సవరించింది.
పెరిగిన వడ్డీ రేటు..
ఈ వారం ప్రారంభంలో ఎస్‌బీఐ ఎంపిక చేసిన కాలపరిమితిపై 65 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్‌డీ రేట్లను పెంచింది. ఇవి డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లకు గరిష్ట వడ్డీ రేటు 7.25 శాతం. ఇది ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న కాల వ్యవధికి అందుబాటులో ఉంటుంది.
7 రోజుల నుంచి 45 రోజుల వరకు పథకాలపై 3 శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడిదారులు 46 రోజుల నుంచి 179 రోజుల మధ్య ఎఫ్‌డీపై 3.9 శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల కంటే తక్కువ పథకాలకు 5.25 శాతం వడ్డీ పొందుతారు. 211 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఉన్న పథకాలకు బ్యాంక్ వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది.
ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్న పథకాలకు బ్యాంక్ 6.75 శాతం ఆఫర్ చేస్తోంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పథకాలకు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఈ సంవత్సరం మే నుంచి చాలా బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పాలసీ ఫలితాలకు అనుగుణంగా తమ ఎఫ్‌డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కువ మంది ఎఫ్‌డీల వైపు ఆకర్షితులవుతున్నారు. మే నుంచి ఆర్‌బీఐ తన రెపో రేటును 4.40 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది.
Also Read: Tanu Sri:భలే ఉన్నావ్ పెళ్లి చేసుకుందామా?.. టిక్ టాకర్ వలపు వల.. చిక్కిన వారు విలవిల!
Also Read: Shardul Thakur: పెళ్లీ పీటలు ఎక్కనున్న శార్దుల్ ఠాకూర్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook