WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Who is Mallika Sagar: డబ్ల్యూపీఎల్ 2024 వేలానికి ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్న మల్లికా సాగర్ ఎవరనే క్రికెట్ అభిమానులు నెట్టింట వెతుకున్నారు. ఐపీఎల్ 2024 వేలానికి కూడా మల్లికానే ఆక్షనీర్‌గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమెపై అందరి దృష్టి నెలకొంది. పూర్తి వివరాలు ఇలా..
Who is Mallika Sagar: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలానికి సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో వేలం ప్రారంభంకానుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనున్నాయి. ఐదు ఫ్రాంచైజీలతో 30 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 165 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 104 మంది ఇండియా ప్లేయర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ వేలంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుజరాత్ జెయింట్స్ జట్టు అత్యధికంగా 10 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది.
డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్ వేలం శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్న మల్లికా సాగర్‌పైనే ఉంది. తొలి సీజన్‌లోనూ ఆమే ఆక్షనీర్‌గా ఉన్నారు. దీంతో ఆమె ఎవరు..? అని నెట్టింట సర్చ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఆర్ట్ కలెక్షన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మల్లికా సాగర (48) ముంబై నివాసి. ప్రస్తుతం ఆమె ఆర్ట్ ఇండియా సంస్థలో పని చేస్తుండగా.. వ్యక్తిగత విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.
2000లో ఆర్ట్ కలెక్షన్‌ను ప్రారంభించిన మల్లికా సాగర్.. 2001లో క్రిస్టీస్‌లో భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళా వేలం కర్తగా నిలిచారు. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌కు కూడా ఆక్షనీర్‌గా వ్యవహరించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలం సందర్భంగా ఆమె అందరినీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 పురుషుల వేలాన్ని కూడా మల్లికా సాగర్‌తో నిర్వహించాలని నిర్వహకులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 నుంచి వేలం నిర్వహిస్తున్న హ్యూ ఎడ్మీడ్స్ ప్లేస్‌ను ఆమె భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ వేలాన్ని హ్యూ ఎడ్మీడ్స్‌తోపాటు రిచర్డ్ మ్యాడ్లీ, చారు శర్మ ఇప్పటివరకు నిర్వహించిన విషయం తెలిసిందే.
గతేడాది ఐపీఎల్ వేలం సమయంలో పోస్టురల్ హైపోటెన్షన్ కారణంగా హ్యూ ఎడ్మీడ్స్ వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వేలానికి ఆయన స్థానంలో మల్లికా సాగర్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వేలంలో ఆక్షనీర్‌గా పాల్గొనాల్సిన అవసరం లేదని హ్యూ ఎడ్మీడ్స్‌కు ఇప్పటికే బీసీసీఐ తెలియజేసినట్లు సమాచారం. మల్లికా సాగార్‌ను బీసీసీఐ ఇప్పటికే సంప్రదించగా.. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: Free Bus Journey: రేపటి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ.. ఈ బస్సుల్లోనే అనుమతి.. రూల్స్ ఇవే..!
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి