WTC 2023-25 Points Table Update: నూతన సంవత్సరం ప్రారంభంలో భారత క్రికెట్ జట్టు అదరగొట్టింది. సఫారీ గ‌డ్డ‌పై కేప్‌టౌన్ టెస్టులో చిరస్మ‌ర‌ణీయ విజయాన్ని సాధించి.. డబ్ల్యూటీసీ రేసులో మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది. కేప్‌టౌన్‌(Kape Town)లో చారిత్రక గెలుపుతో సిరీస్ సమం చేయడమే కాకుండా.. 12 కీలక పాయింట్లు సాధించి ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్-25(WTC 2023-25) ప‌ట్టిక‌లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రోహిత్ సేన 54.16 విజ‌యాల శాతంతో తొలి స్థానంలో ఉండగా.. 50 శాతంతో ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా నాలుగో స్థానంలోనూ, కివీస్ పై తొలిసారి టెస్టు గెలుపొందిన బంగ్లాదేశ్ ఐదోస్థానంలో కొనసాగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా నయా హిస్టరీ
నెంబర్ వన్ జట్టుగా సఫారీ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. తొలి టెస్టులో భారత్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. దీంతో రెండు టెస్టులో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావించింది. కేప్ టౌన్ వేదికపై ప్రారంభమైన సెకండ్ టెస్టులో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. బుమ్రా, సిరాజ్, ముకేశ్ లతో కూడిన బౌలింగ్ త్రయం సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ దెబ్బకు 55 పరుగులకే ఆలౌటైన ప్రోటీస్ జట్టు... రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా పేస్ కు 176 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో భారత్ సౌతాఫ్రికాపై ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. కేవలం ఈ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా నయా రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్య‌ల్ప బంతుల్లోనే గెలుపొందిన జ‌ట్టుగా నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. 



Also Read: IND vs SA 2nd Test Day 1 Highlights: ఒకే రోజు 23 వికెట్లు.. కేప్‌టౌన్‌లో ర్యాంప్ ఆడించిన బౌలర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి