ICC announces World Test Championship 2023 Final Date and Venue: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్‌ డేట్ వచ్చేసింది. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్ తేదీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నేడు ప్రకటించింది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 11 మధ్య అల్టిమేట్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండవ ఎడిషన్‌కు రిజర్వుడే కూడా ఉంది. జూన్‌ 12-16 మధ్య డబ్ల్యూటీసీ 203 జర్వుడే ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్‌ మక్కా 'లార్డ్స్‌' మైదానంలో డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుందని గతంలో ఐసీసీ ప్రకటించింది. అయితే వేదికను మార్చిన ఐసీసీ.. ఓవల్‌లో ఫైనల్ జరుగుతుందని ఈ రోజు ధృవీకరించింది. ఓవల్‌ మైదానం దక్షిణ లండన్‌లోని కెన్నింగ్‌టన్‌లో ఉంది. 1845లో ప్రారంభం అయిన ఓవల్‌.. ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 1880లో తొలి అంతర్జాతీయ టెస్టుకు ఆతిథ్యమిచ్చింది. ఈ మైదానం సర్రే క్రికెట్‌ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌. 


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్లో తలపడే రెండు జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 136 పాయింట్ల (75.56 పర్సంటైల్‌)తో పట్టికలో అగ్ర స్థానంలో ఉండగా.. భారత్‌ 99 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా ఆస్ట్రేలియా దాదాపు ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లకు మిగిలి ఉన్న సిరీస్‌ల ఫలితాలు తేలే వరకు వేచి ఉండాల్సి ఉంది. భారత్ ఫైనల్ చేరాలంటే.. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023ని గెలవాల్సి ఉంది. స్వదేశం కాబట్టి భారత్ భవితవ్యం స్పిన్నర్ల చేతిలోనే ఉంది. 


పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడతాయన్న విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలలో ఆడే టెస్ట్ సిరీస్ ఫలితాల ఆధారంగా రెండు జట్లు ఫైనల్ చేరుతాయి. తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను న్యూజిలాండ్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. 2021లో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియాను ఓడించి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. కివీస్ ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ ట్రోఫీ ఇదే. 


Also Read: IND vs AUS: ఇషాన్‌ కిషన్‌కు చోటు.. భరత్, అక్షర్‌లకు నిరాశ! ఆసీస్‌తో తొలి టెస్ట్‌ ఆడే భారత జట్టిదే  


Also Read: Nissan Magnite Price: చౌకైన, సూపర్ లుకింగ్ ఎస్‌యూవీ.. ఫీచర్లు కూడా అదుర్స్! టాటా పంచ్ కంటే తక్కువ ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.