Ravi Shastri Picks IND Playing 11 vs AUS for 1st Test in Nagpur: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ఆరంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రేపు ఉదయం తొలి టెస్టు ఆరంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ కోసం నాగ్‌పూర్ పిచ్ ఇప్పటికే సిద్దమయింది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌లో స్థానం సంపాదించాలంటే.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక తొలి టెస్ట్ కోసం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన భారత ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు.
రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవెన్‌లో 2-3 అనూహ్య ఎంపికలు ఉన్నాయి. ఓపెనింగ్ స్థానం కోసం కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇద్దరు మంచి ప్లేయర్స్ అని.. కెప్టెన్, కోచ్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పాడు. రవిశాస్త్రి అంచనా ప్రకారం.. రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. 3, 4 స్థానాల్లో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలను ఎంచుకున్నాడు. ఇక ఐదవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గా శ్రీకర్ భరత్ బదులు ఇషాన్ కిషన్‌ను రవిశాస్త్రి ఎంపిక చేసుకున్నాడు.
రవిశాస్త్రి తన జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటిచ్చాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సహా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇచ్చాడు. దాంతో అక్షర్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. ఇక పేస్ కోటాలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎంపిక చేసుకున్నాడు. మొత్తంగా రవిశాస్త్రి ఎంచుకునే జట్టులో రెండు అనూహ్య ఎంపికలు ఉన్నాయి. ఒకటి ఇషాన్ కిషన్ కాగా.. ఇంకొకటి సూర్యకుమార్ యాదవ్. ఈ ఇద్దరు వన్డే, టీ20లలో ఆడుతున్నారని.. శ్రీకర్ భరత్‌కు అవకాశం ఇవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
రవిశాస్త్రి జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్/శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమర్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Also Read: IND vs AUS: పిచ్ గురించి ఆలోచించడం మానేసి.. మ్యాచ్‌పై ఫోకస్ పెట్టండి! రోహిత్ శర్మ ఫైర్
Also Read: IND vs AUS: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. తెలుగు ఆటగాడికి చోటు! భారత్ తుది జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.