If India Wins WTC FInal 2023 Creates History in international Cricket: ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2023కి సమయం ఆసన్నమవుతోంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7-11 మధ్య జరిగే ఈ మెగా పోరులో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరడం టీమిండియాకు ఇది రెండోసారి కాగా.. ఆస్ట్రేలియాకు మొదటిసారి. గత ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన భారత్.. ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మరోవైపు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ కూడా ట్రోఫీ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు బలంగా ఉండటంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ అదే జోరును డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డును తమ పేరుపై లిఖించుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ భారత్‌ గెలిస్తే.. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా రికార్డుల్లో నిలుస్తుంది. భారత్ ఇప్పటివరకు వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లను గెలిచిన విషయం తెలిసిందే. 


1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. 24 ఏళ్ల అనంతరం ఎంఎస్ ధోనీ  సారధ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. ఆపై 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మహీ కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకుంది. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 గెలిస్తే భారత్ ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ చేరుతుంది. మరోవైపు  డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023లో ఆస్ట్రేలియా గెలిచినా కూడా సరికొత్త రికార్డును నెలకొల్పుతుంది. ఆసీస్ ఇప్పటికే వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలిచిన విషయం తెలిసిందే. మొత్తంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. 


జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, మార్నస్ లాబూషేన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్.


Also Read: WTC Final 2023: ఆస్ట్రేలియా ఫేవరేట్ అయినా.. గెలవడానికి టీమిండియాకు ఒక్క రోజు చాలు: రవిశాస్త్రి  


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. కీపర్‌గా కేఎస్ భరత్‌కు నో ఛాన్స్! భారత్ తుది జట్టు ఇదే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.