WTC Final 2023 India Scenario: డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు ఆస్ట్రేలియా.. భారత్ సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?
Scenario for india to qualifiy for wtc 2023 final. ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టులో గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా.. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తుంది.
WTC Final 2023 India Scenario: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మూడు రోజు తొలి సెషన్‌లోపే ముగిసిన మ్యాచ్‌లో భారత్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యంను ఆసీస్ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి ఛేదించింది. మార్నస్ లబుషేన్ (28 నాటౌట్), ట్రావిస్ హెడ్ (49 నాటౌట్) మ్యాచ్‌ను పూర్తి చేసేశారు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును నాథన్ లైయన్ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-2కి చేరింది. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది.
మూడో టెస్ట్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. డబ్ల్యూటీసీ 2021- 2023 సీజన్‌లో 11వ విజయం సాధించిన ఆస్ట్రేలియా.. జూన్ 7న ఇంగ్లండ్‌లో జరగనున్న ఫైనల్లో ఆడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (WTC Final 2023 Points Table) ఆస్ట్రేలియా 68.52 శాతంతో అగ్రస్థానంలో ఉంది. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (52.38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌కు శ్రీలంక, దక్షిణాఫ్రికా పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
భారత్ సమీకరణాలు (India Chances for WTC Final 2023):
# బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టులో గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా.. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తుంది.
# ఒకవేళ భారత్ నాలుగో టెస్టులో ఓడితే మాత్రం డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు భారత్ భవితవ్యం శ్రీలంకపై ఆధారపడి ఉంటుంది.
# మార్చి 9 నుంచి న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను లంక 2-0తో గెలిచి.. భారత్ నాలుగో టెస్టులో ఓడితే మాత్రం.. శ్రీలంక డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు చేరుతుంది.
# న్యూజిలాండ్‌పై శ్రీలంక కనీసం ఒక్క టెస్టు ఓడిపోయినా సరే.. విన్నింగ్ శాతం పరంగా భారత్ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు చేరుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.