WTC 2023 Final: లార్డ్స్‌లోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, 2015 ఫైనల్స్!
Lords Cricket Ground to host World Test Championship 2023. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ 2023 మరియు 2025 ఇంగ్లండ్‌లోని ప్రముఖ లార్డ్స్ స్టేడియంలో జరగనున్నాయి.
Lords to host World Test Championship 2023 and 2025 Finals: ఇంగ్లండ్‌లోని ప్రముఖ లార్డ్స్ స్టేడియం మరో రెండు కీలక మ్యాచ్‌లకు వేదిక కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ 2023 మరియు 2025 లార్డ్స్ స్టేడియంలో జరగనున్నాయి. బర్మింగ్‌హోమ్‌లో మంగళవారం (జూలై 26) ముగిసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏజీఎం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగిన విషయం తెలిసిందే.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021లో ఏజియాస్ బౌల్‌లో జరిగింది. ఈ మ్యాచులో కివీస్ గెలిచి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచింది. వాస్తవానికి డబ్ల్యూటీసీ 1 లార్డ్స్‌లోనే జరగాల్సింది. కరోనా వైరస్ మహమ్మారి పరిమితుల కారణంగా చివరి నిమిషంలో వేదికను లార్డ్స్ నుంచి సౌతాంప్టన్‌కు ఐసీసీ మార్చింది. తర్వాత జరిగే రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ 2023, 2025 మాత్రం లార్డ్స్ వేదికగానే జరగునుండటం గమనార్హం.
జూన్‌లో ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే బీబీసీతో మాట్లాడుతూ.. బహుశా తర్వాతి రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లార్డ్స్ మైదానంలోనే జరిగే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 9 జట్లు తలపడుతున్నాయి. ఇది రెండు సంవత్సరాల సైకిల్ అన్న విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీలో భాగంగా ఒక్కో జట్టు ఆరు టెస్ట్ సిరీస్‌లను ఆడుతాయి. ఇందులో మూడు స్వదేశంలో, మూడు విదేశాల్లో ఆడుతాయి. చివరకు అగ్రస్థానంలో నిలిచిన రెండ్ జట్లు ఫైనల్ ఆడతాయి.
Also Read: Rat Cat Video: పిల్లితో భీకర ఫైట్.. ఎలుక ఎలా తప్పించుకుందో చూడండి (వీడియో)!
Also Read: Vikranth Rona Movie Review: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ.. ప్రేక్షకులను ఆకట్టుకుందా..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook