WTC Final 2023: మంచి ఫామ్ లో ఉన్న విరాట్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే!
WTC Final 2023, Virat Kohli Records V s Australia. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. కోహ్లీని కొన్ని రికార్డ్స్ ఊరిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
WTC Final 2023, Virat Kohli Records Vs Australia: క్రికెట్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023 మరో కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023 టైటిల్ కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో బుధవారం (జూన్ 6) మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గత టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన భారత్.. ఈసారి కప్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా కూడా ట్రోఫీ లక్ష్యంగానే బరిలోకి దిగుతోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు విరాట్ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. మంచి ఫామ్ మీదున్న కోహ్లీ చెలరేగి ఆడితే అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు కష్టమే. మరోవైపు ఆసీస్‌పై కోహ్లీకి మంచి రికార్డులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఆసీస్‌పై 24 టెస్టులు ఆడిన కోహ్లీ.. 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాపై 3 ఫార్మాట్లలో కలిపి 92 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 50.97 సగటుతో 4,954 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు ఉండగా.. 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 జరిగే ఓవల్ మైదానంలో మాత్రం విరాట్ కోహ్లీ రికార్డు గొప్పగా ఏమీ లేదు. ఓవల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 28.16 సగటుతో 169 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ కాగా.. ఒకసారి డకౌట్ అయ్యాడు. అయితే ఇటీవల పూర్వపు ఫామ్ అందుకున్న కోహ్లీ.. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ కీలక టెస్టులో కోహ్లీ చెలరేగి సెంచరీ చేస్తాడని జట్టు మేనేజ్మెంట్ సహా అభిమానులు ఆశిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో కోహ్లీ కొన్ని రికార్డ్స్ ఊరిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
విరాట్ కోహ్లీ రికార్డ్స్:
# ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 1,979 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మరో 21 రన్స్ చేస్తే 2 వేల పరుగులు పూర్తిచేస్తాడు. మరో 55 పరుగులు చేస్తే ఆసీస్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
# ఐసీసీ ఫైనల్స్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాటర్ సౌరవ్ గంగూలీ. 2000లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అతడు సెంచరీ చేశాడు. దాదా రికార్డ్స్ అందుకునే అవకాశం ఇప్పుడు కోహ్లీకి ఉంది.
# అన్ని ఫార్మాట్లలో ఐసీసీ టోర్నమెంట్స్ నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 620 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (657), రికీ పాంటింగ్ (731) ముందున్నారు.
# టెస్టుల్లో ఒకే బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు చేటేశ్వర్ పుజారా పేరిట ఉంది. నాథన్ లయన్ బౌలింగ్‌లో పుజారా 570 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. నాథన్ బౌలింగ్‌లోనే కోహ్లీ 511 పరుగులు చేశాడు.
# ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్ (11 సెంచరీలు) ముందున్నాడు. తర్వాతి స్థానంలో సునీల్ గవాస్కర్, కోహ్లీ (8 సెంచరీలు) ఉన్నారు. మరో సెంచరీ చేస్తే కోహ్లీ రెండో స్థానంలోకి వస్తాడు.
# ఇంగ్లాండ్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ ముందున్నాడు. 46 మ్యాచ్‌ల్లో 2,645 పరుగులు చేశాడు. సచిన్ (2,626 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో కోహ్లీ (2,574) ఉన్నాడు. మరో 72 పరుగులు చేస్తే కోహ్లీ మొదటి స్థానం అందుకుంటాడు.
Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్ పంత్‌కు తుది జట్టులో చోటు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి