WTC Final: టీమిండియా బౌలర్ Ravichandran Ashwinపై పాకిస్తాన్ బౌలర్ సంచలన ఆరోపణలు
Ravichandran Ashwin Latest News :
Ravichandran Ashwin: భారత క్రికెట్ జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకోవడాన్ని దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. వారి విధ్వేషం ఏ స్థాయికి చేరిందంటే టీమిండియాకు చెందిన ఓ ఆటగాడిపై నిషేధం వేటు వేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న టీమిండియా ఆటగాడు మరెవరో కాదు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
సౌతాంప్టన్‌లోని ఏజిస్ బౌల్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై నిషేధం వేటు వేయాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఆకాంక్షిస్తున్నాడు. ఈ మేరకు ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా టీమిండియా (Team India) అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదని, వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అశ్విన్‌ను ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందే నిర్ణయం తీసుకోవాలని పాక్ స్పిన్నర్ అజ్మల్ కోరినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో తనను అలాంటి బౌలింగ్ యాక్షన్ కారణంగా ఐసీసీ నిషేధించినట్లు సైతం అజ్మల్ గుర్తుచేశాడట.
Also Read: WTC Prize Money: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ప్రైజ్‌మనీపై ICC ప్రకటన
బ్యాట్స్‌మెన్స్, ఫాస్ట్ బౌలర్లకు ఐసీసీ రూల్స్ అనుకూలమైనవని, స్పిన్నర్లకు మాత్రం అవి శాపంగా మారాయని ఆరోపించాడు. దూస్రా బంతులు సంధించే సమయంలో చేతిని 15 డిగ్రీల మేర వంచడం కేవలం తనకు మాత్రమే వర్తిస్తుందా అని, అశ్విన్ సైతం నిషేధిత బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్నాడని అజ్మల్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు స్పిన్నర్లను 15 డిగ్రీల మేర చేతిని వంచుతూ బౌలింగ్ వేయడానికి అశ్విన్ ఐసీసీని కోరినట్లు అజ్మల్ సంచలన ఆరోపణలు చేశాడు. మరోవైపు టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ అశ్విన్ (Ravichandran Ashwin) కావడం గమనార్హం.
Also Read: WTC Final 2021: ఆ సిరీస్‌లో Team India విజయాన్ని జీవితంలో మరిచిపోలేను, Ajinkya Rahane
ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ 17 టెస్టుల్లో 69 వికెట్లు పడగొట్టగా, ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ 14 టెస్టుల్లో 70 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్ 13 టెస్టుల్లో 67 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీస్తే ఐసీసీ తొలి డబ్ల్యూటీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కానున్నాడు.
అజ్మల్ ఆరోపణలపై అశ్విన్ స్పందించాడు. కొందరు అనువాదంలో తప్పిదాలు చేసి ఉంటారని, తాను ఐసీసీకి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నాడు. అలాంటి వదంతులను వ్యాప్తి చేయకూడదని సూచించాడు. ఓవరాల్‌గా 78 టెస్టుల్లో 24.69 సగటుతో 409 వికెట్లు సాధించాడు. 30 సార్లు 5 వికెట్లు తీయగా, 7 టెస్టుల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
Also Read: French Open 2021 Winner Female: ఫ్రెంచ్ ఓపెన్ విజేత Barbora Krejcikova, 40 ఏళ్ల తర్వాత చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook