Yashasvi Jaiswal: ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన యశస్వి.. వరుసగా రెండో డబుల్ సెంచరీ..
Yashasvi Jaiswal double century: రాజ్ కోట్ టెస్టులో యశస్వి జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ మళ్లీ డబుల్ సెంచరీ కొట్టాడు. దీంతో టీమిండియాకు 558 పరుగుల ఆధిక్యం లభించింది.
Yashasvi Hits 2nd double Century In Rajkot Test: ఇంగ్లండ్ తో సిరీస్ లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ దుమ్మురేపుతున్నాడు. మరోసారి డబుల్ సెంచరీ కొట్టాడు. రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ ద్విశతకం సాధించాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన యశస్వి 235 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లు సాయంతో 213 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మరోసారి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ యువ ఆటగాడు 72 బంతులాడి ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. వీరిద్దరూ మంచి ఊపుమీదున్న సమయంలో 430/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో ఇంగ్లండ్‌కు 558 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. స్టోక్స్ సేన గెలవాలంటే 539 పరుగులు చేయాల్సి ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 196/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్ మన్ గిల్ 91 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. కాసేపటికే కులదీప్ యాదవ్(27) కూడా పెవిలియన్ చేరాడు. గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన యశస్వి టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు ఇతడికి సర్ఫరాజ్ మంచి సహకారం అందించాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టడం విశేషం. జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి యశస్వి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే క్రమంలో సర్పరాజ్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.
Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి