Sanjay Manjrekar ask Ravindra Jadeja in IND vs PAK Asia Cup 2022 post match interview: టీ20 ప్రపంచకప్‌ 2021 ఓటమికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ సూపర్‌ విక్టరీ సాధించింది. ఆసియా కప్‌ 2022లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం రాత్రి ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో రోహిత్ సేన ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఏ మ్యాచులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. మొహ్మద్ రిజ్వాన్‌ (43; 42 బంతుల్లో 4×4, 1×6) పర్వాలేదనిపించాడు. అనంతరం భారత్ ఐదు వికెట్లను మాత్రమే నష్టపోయి 19.4 ఓవర్లలో 148 రన్స్ చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌లు హార్దిక్‌ పాండ్యా (33 నాటౌట్‌; 17 బంతుల్లో 4×4, 1×6), రవీంద్ర జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6)లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన హార్దిక్.. అనంతరం బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ఇక కీలక దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా.. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు. ఆపై హార్దిక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు కావల్సిన దశలో భారీ షాట్ ఆడి జడ్డూ బోల్డ్ అయ్యాడు. 


మ్యాచ్‌ అనంతరం రవీంద్ర జడేజాను భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేశాడు. అయితే మంజ్రేకర్ ప్రశ్న అడగకముందే జడేజా నవ్వాడు. దాంతో 'జడ్డూ నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా?' అని జడేజాను మంజ్రేకర్ అడిగాడు. 'అవును ఖచ్చితంగా మాట్లాడుతా.. నాకేమీ ప్రాబ్లెమ్ లేదు' అని జడేజా బదులిచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఒక్కసారిగా నవ్వుకున్నారు. మంజ్రేకర్, జడేజాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



సంజయ్ మంజ్రేకర్, రవీంద్ర జడేజా గతంలో ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో జడేజాని బిట్స్ అండ్ పీసెస్ (అరకొర క్రికెటర్) అని మంజ్రేకర్ అన్నాడు. 'నా కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే నేను రెట్టింపు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నా. ముందు మనుషులను గౌరవించడం నేర్చుకో. నీ నోటి విరోచనాలు ఇకనైనా ఆపితే మంచిది' అంటూ జడేజా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఆపై కూడా ఇద్దరి మధ్య మధ్య కోల్డ్‌వార్‌ నడించింది. ఇప్పుడు ఒకరినికొకరు కలుసుకోవడంతో ఇద్దరు నవ్వుకున్నారు. 


Also Read: Rohit Sharma Record: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. 'ఒకే ఒక్కడు'!


Also Read: భారత్‌-పాక్ టీఆర్‌పీ రేటింగ్స్ అదుర్స్.. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ రికార్డులు బ్రేక్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి