IPL Prize Money: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ట్రోఫీన మూడోసారి అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మరోసారి చాంపియన్‌గా నిలిచింది. చెపాక్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై అద్భుతంగా ఆడి నెగ్గిన కేకేఆర్‌ ట్రోఫీని అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌లో మరి విజేతగా నిలిచిన కోల్‌కత్తా ఎంత నగదు బహుమతి అందుకున్నదో.. రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంత మొత్తంలో ప్రైజ్‌ మనీ పొందిందో తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL 2024 Champion KKR:  ఐపీఎల్‌ చాంపియన్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌.. రన్నరప్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్


 


ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటిన విజేతగా నిలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌ నగదు బహుమతి అక్షరాల రూ.20 కోట్లు దక్కింది. దీంతోపాటు ఐపీఎల్‌ ట్రోఫీ కూడా అందుకుంది. శ్రేయర్‌ అయ్యర్‌ జట్టు ప్రైజ్‌ మనీ, ట్రోఫీతో సంబరాలు చేసుకుంది. కోల్‌కత్తా జట్టు విజయంతో పశ్చిమ బెంగాల్‌లో అభిమానులు పండుగ చేసుకున్నారు. ట్రోఫీ అందుకోవాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోర వైఫల్యంతో రన్నరప్‌కు పరిమితమైంది. అయితే రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు రూ.13 కోట్లు దక్కాయి. దీంతోపాటు రన్నరప్‌ ట్రోఫీని కూడా అందుకుంది. రాక రాక వచ్చిన అవకాశాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేజార్చుకుని మరోసారి ట్రోఫీకి దూరమైంది.

Also Read: IPL 2024 KKR vs SRH Live: సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఘోర విఫలం.. కోల్‌కత్తాదేనా ఐపీఎల్‌ ట్రోఫీ?


మిగతా జట్లకు..
మూడో జట్టుగా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌కు రూ.7 కోట్లు లభించింది. ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో ఓడిపోయిన రాజస్థాన్‌ మూడో జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తొలి ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ చేతిలో పరాజయం పొందిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరుకు రూ.6.5 కోట్ల నగదు బహుమతి లభించింది.


స్టార్‌ ఆటగాళ్లకు..
ఐపీఎల్‌ సీజన్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు కూడా నగదు బహుమతులు లభిస్తుంటాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫెయిర్‌ ప్లే, ఎమర్జింగ్‌ ప్లేయర్‌ వంటి విభాగాల్లో ప్రైజ్‌ మనీ లభిస్తుంటాయి. ఆరెంజ్‌ క్యాప్‌ పొందిన విరాట్ కోహ్లికి రూ.10 లక్షలు దక్కాయి. పర్పుల్‌ క్యాప్‌ విజేత హర్షల్ పటేల్ కు రూ.10 లక్షలు లభించాయి. ఎమర్జింగ్‌ ప్లేయర్‌కు రూ.20 లక్షలు, మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ సునీల్ నరైన్ కు రూ.10 లక్షల నగదు బహుమతి దక్కింది. ఉప్పల్ స్టేడియం హైదరాబాద్ పిచ్ కు రూ.50 లక్షలు అందించారు. క్యాచ్ లకు గాను రమణ్ దీప్ సింగ్ కు రూ.10 లక్షలు ఇచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter