Youngest Chess Grandmaster Abhimanyu Mishra: అభిమన్యు మిశ్రా.. భారత సంతతికి చెందిన ఈ చిచ్చరపిడుగు పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. చెస్ క్రీడలో తనదైనశైలిలో దూసుకెళ్తున్నాడు. 12 ఏళ్లు నిండకుండానే గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకున్నాడు. కేవలం రెండున్నర సంవత్సరాల వయసులో తాను చెస్ ఆడటం మొదలుపెట్టానని, 5 ఏళ్లకు పూర్తి రూల్స్ తాను నేర్చుకున్నానని తెలిపాడు. అభిమన్యు మిశ్రా తండ్రిది భోపాల్, కాగా తల్లిది ఆగ్రా. అయితే వీరు అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా అవతరించిన అభిమన్యు మిశ్రా పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. మాగ్నస్ కార్ల్‌సన్ తనకు రోల్ మోడల్ అని చెస్ చిచ్చరపిడుగు అభిమన్యు మిశ్రా (Chess Grandmaster Abhimanyu Mishra) తెలిపాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించడమే తన లక్ష్యమని Chess Champion పేర్కొన్నాడు. ప్రస్తుతం గ్రాండ్ మాస్టర్‌గా ఉన్న అభిమన్యు మిశ్రా తన తదుపరి లక్ష్యం సూపర్ మాస్టర్‌గా ఎదగడమని వెల్లడించాడు. 15 ఏళ్ల వయసులోపే ఆ ఫీట్ నమోదు చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు.


Also Read: Sri Lanka Cricketers Contract Issue: టీమిండియాతో సిరీస్, శ్రీలంక బోర్డు కాంట్రాక్టుకు సంతకం చేయని క్రికెటర్లు, కొనసాగుతున్న సస్పెన్స్



గత రెండు నెలలుగా ఇక్కడే ఉన్నాను. హంగేరి చెస్ టోర్నమెంట్ ఫైనల్ మాత్రం చాలా కష్టమనిపించింది. నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇటీవల 15 ఏళ్ల భారత (Team India) గ్రాండ్ మాస్టర్ లియోన్ లూర్ మెన్డోకాను ఓడించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2009 ఫిబ్రవరి 05వ తేదీన జన్మించిన అభిమన్యు మిశ్రా చెస్ టోర్నీలో మరిన్ని విజయాలు తక్కువ వయసులోనే సాధించాలని ఆకాంక్షిస్తున్నాడు. మూడో గ్రాండ్ మాస్టర్ హోదా కోసం ఎదురుచూస్తున్న అభిమన్యు మిశ్రాకు ఆల్ ది బెస్ట్ చెబుదామా.


Also Read: Devendra Jhajharia: సరికొత్త చరిత్ర సృష్టించిన దేవేంద్ర జఝరియా, మరో స్వర్ణంపై కోటి ఆశలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook