Sri Lanka Cricketers Contract Issue: టీమిండియాతో సిరీస్, శ్రీలంక బోర్డు కాంట్రాక్టుకు సంతకం చేయని క్రికెటర్లు, కొనసాగుతున్న సస్పెన్స్

Sri Lanka Cricketers contract issue: శ్రీలంక క్రికెటర్లు కాంట్రాక్టులపై సంతకాలు చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై ఏం చేయాలన్నదానిపై లంక క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2021, 03:45 PM IST
Sri Lanka Cricketers Contract Issue: టీమిండియాతో సిరీస్, శ్రీలంక బోర్డు కాంట్రాక్టుకు సంతకం చేయని క్రికెటర్లు, కొనసాగుతున్న సస్పెన్స్

Sri Lanka Cricketers contract issue: శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టులో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. క్రికెటర్లు కాంట్రాక్టులపై సంతకాలు చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై ఏం చేయాలన్నదానిపై లంక క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియాతో శ్రీలంక సిరీస్ ఇదివరకే ఖరారు చేశారు. జులై 13 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఓ జట్టు ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌కు వెళ్లగా మరో జట్టు లంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో 5గురు క్రికెటర్లు బోర్డు కాంట్రాక్టుకు సంతకాలు చేయడానికి నిరాకరించారు. లంక జాతీయ బోర్డు క్యాంపులను సైతం ఖాళీ చేసి వెళ్లిపోవడంతో టీమిండియా (Team India)తో సిరీస్‌పై ఏం చేయాలో లంక బోర్డుకు పాలుపోవడం లేదు. లసిత్ ఎంబుల్‌డెనియా, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషెన్ బండార మరియు కాసన్ రజిత అనే ఆటగాళ్లు భారత జట్టుతో జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు సంతకాలు చేయలేదు. 

Also Read: Devendra Jhajharia: సరికొత్త చరిత్ర సృష్టించిన దేవేంద్ర జఝరియా, మరో స్వర్ణంపై కోటి ఆశలు

బయో బబుల్ వాతావరణంలో ఉండటానికి అనుమతి తెలుపుతూ లంక క్రికెటర్లు సంతకాలు చేయాల్సి ఉందని ఎస్‌ఎల్‌సీ సీఈవో ఆష్లై డిసిల్వా తెలిపారు. వారికి జాతీయ కాంట్రాక్ట్ విషయంలో ఓ స్పష్టత ఇస్తేనే టీమిండియాతో సిరీస్‌కు సంతకాలు చేస్తామని ఆటగాళ్లు చెప్పినట్లు సమాచారం. ఆటగాళ్లు ఇదివరకే క్యాంపులు ఖాళీచేసి వెళ్లిపోయారని, లంక (Sri Lanka Cricket Board) బోర్డుకు సంబంధించి దంబుల్లా లేదా కొలంబో బయో బబుల్ శిబిరాలకు రాలేదని వెల్లడించారు. 

Also Read: India vs England Test Series: కీలక టెస్ట్ సిరీస్‌కు టీమిండియా యువ సంచలనం దూరం కానున్నాడా

టీమిండియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు మాత్రమే కాంట్రాక్టులు తీసుకుంటున్నారని, ఇందులో ప్రదర్శన అనంతరం జాతీయ జట్టు కాంట్రాక్టులు ఇచ్చేందుకు లంక బోర్డు సముఖత వ్యక్తం చేస్తోంది. 24 మంది ఆటగాళ్లకు దక్కిన జాతీయ కాంట్రాక్టులో తమకు ఛాన్స్ ఇవ్వలేదన్న కారణంగా ఈ అయిదుగురు క్రికెటర్లు భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న సిరీస్‌కు కాంట్రాక్టులపై సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ సిరీస్‌లో ఆడితే ఆ తరువాత ఆటగాళ్లకు జాతీయ కాంట్రాక్టులు ఇచ్చేందుకు బోర్డు యోచిస్తోందని సైతం డిసిల్వా వివరించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News