Yuvraj singh: స్పేస్‌లోకి యువరాజ్ సింగ్ తొలి సెంచరీ బ్యాట్, వీడియో వైరల్
Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి క్రికెట్ బ్యాట్ గా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాట్ నిలిచింది.
Yuvraj singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj singh) అరుదైన ఘనత సాధించాడు. అతడు తొలిసారి శతకం బాదిన బ్యాట్ (Yuvraj Singh’s maiden ODI century bat) ను అంతరిక్షం (Space) లోకి పంపించింది ఆసియాకు చెందిన ఓ ఎన్ఎఫ్టీ (NFT) మార్కెట్ కలెక్షన్ సంస్థ. స్పేస్‌లోకి వెళ్లిన తొలి బ్యాట్ గా ఇది రికార్డు సృష్టించింది. యువరాజ్‌కు ఎన్ఎఫ్టీలను జారీ చేయడానికి కంపెనీ అతనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాట్‌పై సాంకేతికంగా కొన్ని పరికరాలను అమర్చారు. అందులో మనం బ్యాట్ అంతరిక్షంలో ఎగురుతున్నట్లు చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సదరు సంస్థ షేర్ చేసింది.
2003లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కేవలం 85 బంతుల్లోనే 9ఫోర్లు, 4 సిక్సర్లతో తన తొలి సెంచరీని నమోదు చేశాడు యువరాజ్. బంగ్లాదేశ్ 76 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ వాడిన బ్యాట్ ను ఇప్పుడు స్పేస్ (Space) లోకి పంపించారు.
Also Read: Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్.. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?!!
తాజాగా ఈ విషయంపై యువీ (Yuvi) స్పందించాడు. "నా బ్యాట్ అంతరిక్ష ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాంలో చేరడం వల్ల నా ఫ్యాన్స్ తో అనుబంధం మరింత పెరుగుతుంది. ఈ బ్యాట్‌తోనే నేను తొలి శతకం బాదాను" అని అన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook