Yuzvendra Chahal becomes first RR spinner to take most wickets in a single IPL season: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2022లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచులో వికెట్లు పడగొడుతూ.. ఆర్‌ఆర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని యూజీ.. ఈ సీజన్లో తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో అత్యధిక వికెట్లు (22) పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచులో యుజ్వేంద్ర చహల్‌ తన కోటా నాలుగు ఓవర్లలలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఐపీఎల్ టోర్నీలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా యూజీ రికార్డు నెలకొల్పాడు. 2019లో 20 వికెట్లతో ఈ రికార్డు శ్రేయస్‌ గోపాల్‌ పేరిట ఉంది. తాజాగా చహల్‌.. గోపాల్‌ను అధిగమించాడు. పంజాబ్ బ్యాటర్ జానీ బెయిర్‌ స్టో వికెట్‌ తన ఖాతాలో వేసుకుని ఈ ఫీట్‌ నమోదు చేశాడు.  


పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేయడం ద్వారా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో నాలుగు సీజన్లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన లసిత్ మలింగ రికార్డును (2011, 2012, 2013, 2015) యూజీ సమం చేశాడు. అంతేకాదు నాలుగు సీజన్లలో (2015, 2016, 2020, 2022) 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ కెరీర్‌ను యుజ్వేంద్ర చహల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత సీజన్ వరకు బెంగళూరు జట్టులోనే కొనసాగిన చాహల్.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాసాగుతున్నాడు. ఐపీఎల్‌ మెగా వేలం 2022కు ముందు బెంగళూరు అతడిని వదిలేయగా.. రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీపడి మరీ ఆరున్నర కోట్లకు చహల్‌ను సొంతం చేసుకుంది. తాజా సీజన్లో యూజీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసి సత్తాచాటాడు.


Also Read: Delhi Capitals Covid: ఢిల్లీ జట్టులో మరోసారి కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో ప్లేయర్స్! చెన్నైతో మ్యాచ్ డౌటే


Also Read: Pujita Ponnada Pics: పొట్టి షార్ట్ లో పూజిత పొన్నాడ.. తెలుగు అందం గ్లామర్ డోస్ పీక్స్ చేరినట్టుందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook