Dhanashree Verma Dances To Pushpa Movie Song Sami Sami: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పుష్ప: ది రైజ్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విదులైన పుష్ప సినిమా (Pushpa Movie ).. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తోంది. అల్లు అర్జున్ నటన, కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) అందంతో ఈ సినిమా రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ కాకముందే పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ పాపులర్ అయ్యాయి. దాంతో సామున్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలపై రీల్స్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal) సతీమణి ధనశ్రీ వర్మ (Dhanashree Verma).. పుష్ప సినిమాలోని 'సామిసామి' పాటకు అదిరే స్టెప్పులేశారు. స్వతహాగా కొరియో గ్రాఫర్ అయిన ధనశ్రీ.. తనదైన శైలిలో డాన్స్ చేశారు. రష్మిక మందన్న కంటే బాగా వేశారు. తన డాన్స్ వీడియోని ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'మేము ఇద్దరం మళ్లీ వచ్చాము. మా స్టైల్ ఎలా ఉంది. మీ అభిప్రాయం చెప్పండి' అని చహల్ సతీమణి కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధనశ్రీ స్టెప్పులకు (Dhanashree Verma Dance) అల్లు అర్జున్, రష్మిక ఫాన్స్ కూడా ఫిదా అయిపోయారు. వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.


Also Read: IRE Vs USA: అందుబాటులో లేని అంపైర్లు.. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ రద్దు! కారణం ఏంటంటే?


ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ (Dhanashree Verma) 2014లోనే నవీ ముంబైలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. కొన్నిరోజుల పాటు డెంటిస్ట్‌గా పనిచేశారు. అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఇష్టం. అందుకే డాక్టర్ వృత్తిని వదిలేశారు. ఆమెకు ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీ ఉంది. అంతేకాదు సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. ఇక ట్విట్టర్, ఇన్‌స్టాలో ధనశ్రీని చాలా మంది అనుసరిస్తున్నారు. యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal) దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికకాలేదు. అంతర్జాతీయ కెరీర్‌లో చహల్ ఇప్పటివరకు 56 వన్డేల్లో, 50 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.


Also Read: IND vs SA: ఓ నాయకుడిగా విరాట్ కోహ్లీ జట్టులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు: ద్రవిడ్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook