Massive Fire Breaks Out in Former Indian Cricketer Zaheer Khan restaurant building: మహారాష్ట్రలోని పూణె నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం లుల్లానగర్ ప్రాంతంలోని మార్వెల్ విస్టా భవనం పై అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. రెస్టారెంట్‌లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్నట్లుగా సమాచారం. భారీ మంటలకు హోటల్ పై భాగం పూర్తి దెబ్బతిందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లుల్లానగర్ ప్రాంతంలోని మార్వెల్ విస్టా కమర్షియల్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్‌లో ఈరోజు ఉదయం 8.15 గంటలకు బరి అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్‌లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడడంతో పాటు దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు, మూడు వాటర్‌ ట్యాంకర్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలను అదుపు తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటన్నర పాటు కష్టపడ్డారు. 


విస్టా కమర్షియల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉంది. జహీర్ రెస్టారెంట్‌కు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని సమాచారం. ఉదయం కావడంతో రెస్టారెంట్‌లో జనాలు లేరు. దాంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. అయితే భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Also Read: గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసుండరు!


Also Read: Poonam Bajwa Pics: కన్ను గీటుతూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook