India beat Zimbabwe in 2nd ODI: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఐదు వికెట్లను కోల్పోయి 25.4 ఓవర్లలో 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తొలి వన్డే హీరోలు శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33) రాణించారు. సంజూ శాంసన్ (43 నాటౌట్) మరోసారి సత్తాచాటాడు. జింబాబ్వే బౌలర్లలో ల్యూక్ జాంగ్వే రెండు వికె ట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే సోమవారం జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వల్ప లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (1) ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. దాంతో శిఖర్ ధావన్ (33; 21 బంతుల్లో 4 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (33; 34 బంతుల్లో 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. ధావన్ అనంతరం ఇషాన్ కిషన్ కూడా (6) చేరాడు. దీపక్ హుడా (25), సంజూ శాంసన్ (43 నాటౌట్; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా సంజూ దూకుడుగా ఆడుతూ.. పరుగులు చేశాడు. 


ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. సిరాజ్, శార్దూల్, ప్రసిద్ధ్ చెలరేగడంతో.. కైటానో (7), కాయా (16), మధెవెరె (2), చాకబ్వా (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దాంతో జింబాబ్వే 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో జట్టును సికందర్ రజా (16), షాన్ విలియమ్స్ (42) కాసేపు ఆదుకున్నారు. 



షాన్ విలియమ్స్ అవుటైన తర్వాత ర్యాన్ బర్ల్ (39 నాటౌట్) రాణించాడు. టేయిలెండర్ల అండతో బర్ల్ రన్స్ చేశాడు. ల్యూక్ జాంగ్వే (6), బ్రాడ్ ఎవాన్స్ (9), విక్టర్ న్యూచీ (0), తనక చివాంగ (4) ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకోగా.. సిరాజ్, ప్రసిద్ధ్, అక్షర్, కుల్దీప్ , దీపక్ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే సోమవారం జరగనుంది. 


Also Read: బుసలు కొడుతోన్న అతిపెద్ద కింగ్‌ కోబ్రాకు ఎలా కళ్లెం వేశాడో చూడండి.. నీ గుండె ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్!


Also Read: Heavy Rains: ఉత్తరాధిలో జల విలయం..కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌లు..వీడియో వైరల్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook