King Cobra Viral Video: బుసలు కొడుతోన్న అతిపెద్ద కింగ్‌ కోబ్రాకు ఎలా కళ్లెం వేశాడో చూడండి.. నీ గుండె ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్!

Snake catcher caught Wild King Cobra cleverly. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను స్నేక్‌ క్యాచర్‌ కిరణ్ చాలా తెలివిగా పట్టేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 20, 2022, 03:22 PM IST
  • నీ గుండె ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్
  • బుసలు కొడుతోన్న అతిపెద్ద కింగ్‌ కోబ్రాకు ఎలా కళ్లెం వేశాడో
  • వీడియో చూస్తే గూస్ బంప్స్ ఖాయం
King Cobra Viral Video: బుసలు కొడుతోన్న అతిపెద్ద కింగ్‌ కోబ్రాకు ఎలా కళ్లెం వేశాడో చూడండి.. నీ గుండె ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్!

Snake catcher Kiran caught Wild King Cobra cleverly at orchard: ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విషపూరితమైన పాముగా కింగ్‌ కోబ్రాకు పేరుంది. అందుకే కింగ్‌ కోబ్రా పేరు వింటేనే చాలా మంది జడుసుకుంటారు. అలాంటి పాము కనిపిస్తే అంతే సంగతులు.. ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పరుగు తీస్తారు. కింగ్ కోబ్రా కాటు మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. భారీ ఏనుగు కూడా కరిచిన వెంటనే చనిపోతుందంటే.. కింగ్ కోబ్రా విషం పవర్ ఏమిటో మనం అర్ధం చేసుకోవచ్చు. అందుకే స్నేక్‌ క్యాచర్‌లు కూడా ఈ పామును పట్టుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి దృశ్యమే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

'సుజన్ శెట్టి' అనే యూట్యూబ్ ఛానెల్‌లో అతిపెద్ద కింగ్‌ కోబ్రాకు సంబందించిన వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం... స్నేక్ కిరణ్ అనే స్నేక్‌ క్యాచర్‌ కర్ణాటకలో అత్యంత విషపూరితమైన కింగ్‌ కోబ్రాను చాలా తెలివిగా పట్టాడు. ఓ తోటలో కింగ్‌ కోబ్రా తిరుగుతుండగా.. దాని యజమానులు స్నేక్‌ క్యాచర్‌కు విషయం చెప్పారు. స్నేక్ కిరణ్ పక్కా ప్లాన్‌తో తోటలోకి వచ్చాడు. ముందుగానే ఓ మూరెడు ఉన్న ప్లాస్టిక్ పైపును తెచ్చాడు. దానికి ఓ చివర పెద్ద కవర్ కట్టాడు. దాన్ని నేలపై పెట్టాడు. 

ఇక తోటలోని కాలువలో ఉన్న కింగ్‌ కోబ్రాను పైపు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు స్నేక్ కిరణ్. ఈ క్రమంలో పాము తోక పట్టుకుని తీసుకువెళుతుండగా.. అది కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి చూస్తాడు. ఓసారి తోకను పట్టుకోగా.. పడగ విప్పిన పాము ఒక్కసారిగా మీదుకు వస్తుంది. దాంతో కిరణ్ తోకను వదిలేసి పక్కకు జరుగుతాడు. చాలా ప్రయత్నాల అనంతరం పామును పైపు వద్దకు తీసుకెళతాడు. రంద్రం అనుకుని పాము అందులోకి దూరుతుంది. కవర్లోకి వెళ్ళగానే కిరణ్ పైపు తీసేసి ముడివేస్తాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News