ZIM vs IND: మరోసారి స్వల్ప స్కోరుకే జింబాబ్వే ఆలౌట్.. భారత్ ముందు సునాయాస టార్గెట్!
IND vs ZIM, Zimbabwe All-Out for 161 in 2nd ODI. జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో వన్డేలో టీమిండియా ముందు 162 పరుగుల లక్ష్యం ఉంది.
ZIM vs IND 2nd ODI, Shardul Thakur three wickets helps Zimbabwe All-Out for 161: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత బౌలర్లు సత్తాచాటారు. శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. దాంతో జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో వన్డేలో టీమిండియా ముందు 162 పరుగుల లక్ష్యం ఉంది. జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (42), రైన్ బర్ల్ (39 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వేకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. సిరాజ్, శార్దూల్, ప్రసిద్ధ్ చెలరేగడంతో కైటానో (7), ఇన్నొసెంట్ కాయా (16), మధెవెరె (2), రెగీస్ చాకబ్వా (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దాంతో జింబాబ్వే 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో జట్టును సికందర్ రజా (16), షాన్ విలియమ్స్ (42) కాసేపు ఆదుకున్నారు.
షాన్ విలియమ్స్ అవుటైన తర్వాత ర్యాన్ బర్ల్ (39 నాటౌట్) రాణించాడు. ఓ దశలో జింబాబ్వే స్కోర్ 120 పరుగులు కూడా కష్టం అనుకున్నా.. బర్ల్ పుణ్యమాని 161 పరుగులు చేసింది. టేయిలెండర్ల అండతో బర్ల్ రన్స్ చేశాడు. ల్యూక్ జాంగ్వే (6), బ్రాడ్ ఎవాన్స్ (9), విక్టర్ న్యూచీ (0), తనక చివాంగ (4) ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ 3 వికెట్లు తీసుకోగా.. సిరాజ్, ప్రసిద్ధ్, అక్షర్, కుల్దీప్ , దీపక్ తలో వికెట్ తీసుకున్నారు.
Also Read: Revanth Reddy : రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా! మునుగోడులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook