Wipro: కరోనా వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పని చేసే సౌకర్యం మొదలైంది. దీంతో చాలామంది వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ కి అలవాటు పడిపోయారు. కరోనా మహమ్మారి వచ్చి దాదాపు ఐదేళ్లు అవస్తూ ఉన్నా ఇంకా చాలా కంపెనీలు ఎంప్లాయిస్ ని ఆఫీసులకు పిలవలేదు. కాగా ప్రస్తుతం కరోనా ఉసే లేకపోవడంతో ఒక్కో కంపెనీ తమ ఎంప్లాయిస్ ని తిరిగి ఆఫీసుకు వచ్చి పని చేయాలి అని కండిషన్లు పెట్టడం మొదలు పెడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్ ని అమలపరిచాయి. అనగా వారంలో కొన్ని రోజులు ఆఫీసు నుంచి.. మరికొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే సదుపాయం కల్పించాయి. కాగా అది కూడా కంపెనీలను బట్టి పాలసీ మారుతూ వచ్చింది. అనగా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంపల్సరీ పెట్టగా.. మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆప్షన్ తప్పనిసరి అని ఏమీ తెలపడం లేదు.


తాజాగా భారతదేశంలోని అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీలలో ఒకటైన విప్రో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది. ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.


ఈ కొత్త నిబంధన ప్రకారం, కంపెనీ ఉద్యోగులు ప్రతి వారం కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి ఉంటుంది.ముందుగా చెప్పినట్టు ఇప్పటికే ఇండియాలో అగ్రసేని కంపెనీలు అయినా TCS, ఇన్ఫోసిస్‌తో లాంటివి తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆప్షన్ కంపల్సరీ అని చెప్పగా.. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతోంది విప్రో. 


ఇక ఈ విప్రో కొత్త నియమం 15 నవంబర్ 2023 నుండి అమలులోకి రాబోతోంది. దీని వల్ల వృత్తిపరమైన అభివృద్ధి ఉండటంతో పాటు సహోద్యోగులు, క్లయింట్లతో నేరుగా సంభాషిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని ఐటీ సంస్థ పేర్కొంది.


మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, నవంబర్ 6, 2023న విప్రో కంపెనీ తమ ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఈ పాలసీ మార్పు గురించి తెలియజేసింది. ఇక విప్రో చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ తాము తీసుకున్న హైబ్రిడ్ వర్క్ మోడల్ నిర్ణయం గురించి ప్రస్తావిస్తూ.. ఈ నిర్ణయం విప్రో కార్పొరేట్ కల్చర్ పెంచడానికి అలానే ముఖాముఖి కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి  తీసుకున్నట్లు తెలిపారు.


ఉద్యోగులు కార్యాలయానికి రాకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఈ నేపథ్యంలో విప్రో వారు తెలిపారు. కొత్త వర్క్ పాలసీని అనుసరించకుంటే జనవరి 7, 2024 నుంచి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాము పంపిన ఈమెయిల్లో జతపరిచారు.


కాగా కరోనా కాలం తర్వాత పని విధానం మారింది. కానీ వర్క్ ఫ్రొం హోమ్ వల్ల టీమ్లతో కనెక్షన్ అలానే ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు అలాంటి కార్పొరేట్ కల్చర్ ని మళ్ళీ పెంపొందించడానికి ఒక్కో కంపెనీలు ఈ హైబ్రిడ్ ఫాలో అవుతూ.. ఈ నియమాన్ని పాటించని వారి పైన తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు.


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook