కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలీకం కంపెనీలు ఎప్పటికప్పుడు వివిధ రకాల ప్లాన్స్ అందిస్తుంటాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ మరో ప్లాన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన 489,509 రూపాయల ప్రీ పెయిడ్‌ప్లాన్స్‌‌లో అపరిమితమైన డేటా లభిస్తుంది. ఇతర అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్ 489 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు


ఎయిర్‌టెల్ 489 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో అందుతోంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతేకాకుండా 30 రోజులకై 50 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్, అపోలో సేవలు, ఫాస్టాగ్‌పై క్యాష్‌బ్యాక్ వంటి చాలా ప్రయోజనాలున్నాయి.


ఎయిర్‌టెల్ 509 ప్రీపెయిడ్ వివరాలు


ఎయిర్‌టెల్ 509 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో 1 నెల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. నెలకు 60 జీబీ డేటా ఉంటుంది. ఈ ప్లాన్‌తో పాటు ఉచిత వింక్ మ్యూజిక్, ఉచిత హెలో ట్యూన్, ఆపోలో సేవలు వంటి ప్రయోజనాలున్నాయి.


ఈ రెండు ప్రీ పెయిడ్ ప్లాన్స్‌లో కూడా ఎయిర్‌టెల్ 5జి నెట్‌వర్క్ వినియోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ బల్క్ డేటా ప్లాన్‌పై యూజర్లు 5జి ప్లస్ అందుబాటులో ఉన్న నగరాల్లో 5జీ సేవల్ని పొందవచ్చు. కానీ దీనికోసం 5జి ఫోన్ తప్పనిసరి. 5జి తో అత్యంత వేగవంతమైన స్పీడ్ పొందవచ్చు.


Also read: PPF Calculator: పీపీఎఫ్‌లో భారీ ఆదాయం పొందాలనుకుంటున్నారా..? ఈ ట్రిక్‌ పాటిస్తే మీరు కోటీశ్వరులే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook