Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ Oneplus మొబైల్స్‌పై 30 శాతం తగ్గింపు..
Amazon Great Indian Festival Sale 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా OnePlus స్మార్ట్ ఫోన్స్ ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఈ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా పొందుతారు. అయితే ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Great Indian Festival Sale 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా OnePlus స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ సేల్‌లో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా Oneplus 11 5G, Oneplus 11R 5G స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఈ మొబైల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్‌లో డెడ్ చీప్ ధరలకే లభించనున్నాయి. అంతేకాకుండా బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో OnePlus మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్:
OnePlus 11R 5G:
అమెజాన్‌లో ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. కంపెనీ ఈ OnePlus 11R స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఫిబ్రవరిలో రూ. 39,999తో విక్రయించింది. అయితే ఈ సేల్‌లో రూ. 2,000 బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో పాటు రూ. 3,000 కూపన్ తగ్గింపును కూడా పొందవచ్చు. దీంతో మీరు రూ. 34,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు. ఈ మొబైల్ ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 5G SoCపై పని చేస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్ 100W SUPERVOOC S ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
OnePlus 11 5G:
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా OnePlus 11 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. OnePlus 11 5G బేస్ వేరియంట్ ధర రూ. 56,999లతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 7,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీ సపోర్ట్‌తో రాబోతోంది. అంతేకాకుండా 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
OnePlus Nord CE 3 5G:
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా OnePlus Nord CE 3 5G మొబైల్ రూ. 22,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 782G SoCపై పని చేస్తుంది. దీంతో పాటు మీరు 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి