Apple iPhone 16: మార్కెట్‌లో ఎన్ని స్మార్ట్‌ఫోన్లు ఉన్నా ఐఫోన్ స్థానం ప్రత్యేకం. ఇప్పటికీ ఐఫోన్ అంటే స్టేటస్ సింబల్ ఒక్కటే కాదు..సెక్యూరిటీ కూడా. అందుకే ధర ఎక్కువైనా సరే కొనేందుకు వెనుకాడరు. ఏడాదికో మోడల్ లాంచ్ చేసే ఆపిల్ సంస్థ నుంచి ఐఫోన్ 16పై అప్‌డేట్ లీకైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆపిల్ ఐఫోన్ అంటే అందరికీ మక్కువ ఎక్కువ. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, సూపర్ సెక్యూరిటీ ఈ ఫోన్ సొంతం. ఏడాదికి ఒక మోడల్ లాంచ్ అవుతుంటుంది. ప్రతి యేటా సెప్టెంబర్ నెలలో కొత్త మోడల్ విడుదల చేస్తుంటుంది కంపెనీ. ఈ ఏడాది అంటే మరో ఏడు నెలల్లో ఐఫోన్ 16 లాంచ్ కానుంది. అప్పుడే దీనికి సంబంధించిన అప్‌డేట్ ఐఫోన్ ప్రియుల్ని ఉత్సాహపరుస్తోంది. ఇందులో కొత్తగా మరో ఫీచర్ చేరనుంది. ఈ కొత్త ఫీచర్ ప్రకారం ఫోన్ ఓపెన్ చేయకుండానే కెమేరా యాక్సెస్ పొందవచ్చు. అంటే ఫోటోలు తీసుకోవచ్చు.


2023 సెప్టెంబర్ నెలలో విడుదలైన ఐఫోన్ 15లో కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టిన ఆపిల్ సంస్థ ఐఫోన్ 16లో మరిన్ని అదనపు ఫీచర్లు జత చేర్చనుంది. ఇందులో భాగంగా కొత్తగా ప్యానెల్‌పై భాగంలో ఓ బటన్ చేరనుంది. ఈ బటన్ ద్వారా ఫోన్ ఓపెన్ చేయకుండానే కెమేరా యాక్సెస్ తీసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 లాంచ్ కానుంది. ఈ కొత్త ఐఫోన్‌లో కొత్త ఫీచర్ బటన్ ఫోన్‌కు కుడివైపు దిగువన ఉంటుంది. అంటే మీరు ల్యాడ్ స్కేప్ మోడ్ ఫోటోలు తీస్తుంటే సరిగ్గా  మీ చూపుడు వేలు స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ కొత్త కెమేరా బటన్..కెపాసిటర్ బటన్‌లా కూడా పనిచేస్తుంది. అంటే కెమేరా జూమ్ కోసం, కుడి, ఎడమకు స్వైప్ చేసేందుకు ఈ బటన్ ఉపయోగపడుతుంది. 


ఐఫోన్ 16కు సంబంధించి ఇది ఒక అప్‌డేట్ మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో ఐఫోన్ 16 గురించి మరిన్ని అప్‌డేట్స్ తెలుసుకోగలం. 


Also read: OnePlus 12 Series: వన్‌ప్లస్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ట్రిపుల్ కెమేరా, 16 జీబీ ర్యామ్, తొలి LTPO టెక్నాలజీతో, ధర ఎంతంటే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook