Xiaomi Redmi Note 13 4G Review In Telugu: ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మెగ్గు చూపుతున్నారు. అందులో ప్రీమియం ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ మొబైల్స్‌ను ఎక్కువగా కొంటున్నారని ఇటీవలే పలు నివేదికలు తెలిపాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కూడా మిడిల్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే ప్రముఖ చైనీస్‌ టెక్‌ కంపెనీ రెడ్‌ మీ ఇటీవలే లాంచ్‌ చేసిన Redmi Note 13 4G మొబైల్‌కి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్‌ రివ్యూ, రేటింగ్‌ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రివ్యూ తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సానుకూలతలు (Pros):
ప్రీమియం డిజైన్: రెడ్‌ మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం డిజైన్‌లో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇది చూడడానికి ఎంతో స్టైలిష్‌గా, మన్నికగా కనిపిస్తుంది. అంతేకాకుండా వెనక భాగంలో అద్భుతమైన ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది వివిధ రకాల కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 


డిస్‌ప్లే: ఈ Redmi Note 13 4G మొబైల్‌ 6.67 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్ల్పే ప్రీమియం పిక్చర్‌ క్వాలిటీని అందిస్తుంది. ఎలాంటి వీడియోస్‌ అయిన మంచి అవుట్‌పుట్‌తో చూడొచ్చు. దీంతో పాటు ఈ స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ లభిస్తోంది.  మృదువైన స్క్రోలింగ్‌కి ఈ స్స్రీన్‌ ఎంతగానో సహాయపడుతుంది. 


డీసెంట్ పనితీరు, బాటరీ లైఫ్: ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 685 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా గేమింగ్‌ కోసం ఇది ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు మల్టీ టాస్కింగ్‌ చేసుకునేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లో 5000mAh బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో రోజంతా నాన్‌స్టాప్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగించవచ్చు. 


ఇతర ఫీచర్స్‌: ఇక ఈ Redmi Note 13 4G  స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఆండ్రాయిడ్ విషయానికొస్తే.. ఇది MIUI 14 (ఆండ్రాయిడ్ 13)పై రన్‌ అవుతుంది. దీంతో పాటు మెరుగైన  భద్రతను అందిస్తుంది. అలాగే సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ను కూడా అందిస్తోంది.


ప్రతికూలతలు (Cons):
ఈ Redmi Note 13 4G స్మార్ట్‌ఫోన్‌ అనేక మిస్టేక్స్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అన్ని స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు 5G నెట్‌వర్క్‌తో మొబైల్‌ను లాంచ్‌ చేస్తే, ఇది మాత్రం 4G నెట్‌వర్క్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఈ మొబైల్‌కి పెద్ద మైనస్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. 


సాదా కెమెరా :
ఈ మొబైల్‌ 50MP ప్రధాన సెన్సార్ కెమెరా కలిగి ఉన్నప్పటికీ రాత్రిపూట ఫోటో గ్రఫీ కోసం ఎలాంటి ఫీచర్స్‌ను అందివ్వలేదు. దీంతో పాటు కెమెరా ఫీచర్స్‌ పరంగా అతంగా అప్డేట్‌ను అందిచలేకపోయింది. 


అలాగే స్పెసిఫికేషన్‌లలో భాగంగా Redmi Note 12 4Gతో పోల్చితే పెద్దగా మార్పులు లేనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎలాంటి కొత్త ప్రీమియం ఫీచర్స్‌ను అందచలేదు. గతంలో విడుదల చేసిన Note 12 4Gతో ఉన్న ఫీచర్స్‌, స్పెషిఫికేషన్సే ఇందులో ఉన్నాయి.


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


Redmi Note 13 4G బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ, 5G లేకపోవడం, లో క్వాలిటీ కెమెరా కారణంగా కొంతమంది వినియోగదారులకు ఇబ్బంది కలిగించవచ్చు. మీకు 5G అవసరం లేకుంటే, మంచి బ్యాటరీ లైఫ్‌తో కూడిన స్టైలిష్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది మంచి ఎంపిక. అయితే మీరు 5G నెట్‌వర్క్‌ లేదా మెరుగైన కెమెరా కోసం చూస్తున్నట్లయితే మార్కెట్‌లో ఇతర మొబైల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.


రేటింగ్ (Rating):
3.5 Out Of 5 Stars


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter