Best 4K Tv In Dead Cheap Price: మార్కెట్లోకి తోషిబా M650 4K మినీ LED TV..ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు
Best 4K Tv In Dead Cheap Price: తోషిబా ఇటీవలే విడుదల చేసిన స్మార్ట్ టీవీపై అమెజాన్‌లో డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. కంపెనీ ఇటీవలే ఈ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Best 4K Tv In Dead Cheap Price: జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తోషిబా తన కొత్త టీవీని భారతదేశంలో విడుదల చేసింది. తోషిబా M650 4K మినీ LED అనే పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 4K డిస్ప్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టీవీకి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడ తెలుసుకుందాం.
Toshiba M650 4K Mini LED TV ధర:
మార్కెట్‌లో 55 అంగుళాల Toshiba M650 4K Mini LED స్మార్ట్ టీవీ ధర రూ. 54,999లకు అందుబాటులో ఉంది. 65 అంగుళాల మోడల్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ రూ.74,999 ధరను కలిగి ఉంది. వీటి ఈ టీవీ విక్రయాలు జూలై 15 నుంచి ఈ కామర్స్ వెబ్ సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఈ టీవీలు కంపెరీ సూచించిన ధరలకు మాత్రమే లభిస్తాయి. ముందు ముందు వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
తోషిబా M650 4K మినీ LED TV స్పెసిఫికేషన్స్:
తోషిబా M650 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్‌ల వివరాల్లోకి వెళితే..ఈ రెండు టీవీలు 4K రిజల్యూషన్‌తో పాటు మినీ LED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ టీవీ గరిష్టంగా 600 nitsతో పాటు 60Hz రిఫ్రెష్ రేటుతో కంపెనీ రూపొందించింది. అంతేకాకుండా మంచి వీడియో అనుభూతి కోసం..HDR10+, Dolby Vision IQ వంటి చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
ఇతర ఫీచర్లు:
✽ అల్ట్రావిజన్ 120 టెక్నాలజీ
✽ 4K రిజల్యూషన్ LED డిస్‌ప్లే
✽ Dolby Vision IQ సపోర్ట్
✽ M650 49W స్పీకర్లు
✽ 2.1 ఛానల్ స్పీకర్ సిస్టమ్
✽ REGZA బాస్ వూఫర్
✽ REGZA పవర్ ఆడియో ప్రో
✽ 1.5GB ర్యామ్, 4GB స్టోరేజ్
✽ Mali G52 GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్
✽ Google Assistant ఫీచర్
✽ VIDAA OS
✽ డ్యూయల్ బ్యాండ్ వైఫై
✽ HDMI 2.1 పోర్ట్
✽ USB పోర్ట్‌లు
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook