Lava Blaze 1X 5G Price: చైనీస్ ఫోన్లను తలదన్నే దేశీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. 12 వేలకే అద్భుత ఫీచర్లు!
Lava launched Lava Blaze 1X 5G Smartphone in India with RS 12000. లావా కంపెనీ మరో బడ్జెట్ 5G ఫోన్‌ను తీసుకువస్తోంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు లావా బ్లేజ్ 1X 5G (Lava Blaze 1X 5G).
Lava launched Lava Blaze 1X 5G Smartphone in India with RS 12000: మేడ్ ఇన్ ఇండియా కంపెనీ 'లావా' ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే లావా కంపెనీ పలు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తక్కువ ధరకే 5జీ ఫోన్లను కంపెనీ విడుదల చేయనుంది. అతి త్వరలో అగ్ని 2 5G (AGNI 2 5G) ఫోన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే అంతకుముందే కంపెనీ మరో బడ్జెట్ 5G ఫోన్‌ను తీసుకువస్తోంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు లావా బ్లేజ్ 1X 5G (Lava Blaze 1X 5G). ఈ ఫోన్ తయారీ శరవేగంగా జరుగుతోంది. వచ్చే వారం ఇది అధికారికంగా లాంచ్ కానుంది. అయితే అంతకుముందే లావా కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లను ఇప్పటికే వెల్లడించింది. లావా బ్లేజ్ 1X 5G ధర మరియు ఫీచర్లను ఓసారి చూద్దాం.
Lava Blaze 1X 5G Price India:
లావా బ్లేజ్ 1X 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగులలో (గ్లాస్ బ్లూ మరియు గ్లాస్ గ్రీన్) వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.12,000 ఉంటుందని అంచనా.
Lava Blaze 1X 5G Features:
లావా బ్లేజ్ 1X 5G మంచి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే ఇందులో ఉంది. MediaTek డైమెన్సిటీ 700 SoC ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. లావా బ్లేజ్1X 5G గరిష్టంగా 6GB వరకు ఫిజికల్ ర్యామ్ మరియు 5GB వరకు వర్చువల్ ర్యామ్ ఆప్షన్‌తో వస్తుంది.
Lava Blaze 1X 5G Camera, Battery:
లావా బ్లేజ్ 1X 5Gలో 50MP బ్యాక్ కెమెరా, VGA డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరా మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.1, GPS మరియు USB టైప్-సి ఉన్నాయి. ఇది 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Lava Blaze 1X 5G Specs:
లావా బ్లేజ్ 1X 5G ఫోన్ 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 700 7nm ప్రాసెసర్‌తో పాటు Mali-G57 MC2 GPU ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6GB RAM మరియు 128GBతో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్‌తో 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12లో నడుస్తుంది. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రో SD) స్లాట్‌ను కలిగి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.